Minister: ఆలయాల్లో ఏనుగులకు ప్రత్యేక వసతులు

ABN , First Publish Date - 2023-02-09T11:19:18+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పోషించే ఏనుగులకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు(Minister PK Shekhar Babu) పేర్కొన్నారు.

Minister: ఆలయాల్లో ఏనుగులకు ప్రత్యేక వసతులు

- మంత్రి పీకే శేఖర్‌బాబు

ప్యారీస్‌(చెన్నై), ఫిబ్రవరి 8: రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పోషించే ఏనుగులకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు(Minister PK Shekhar Babu) పేర్కొన్నారు. కోయంబత్తూర్‌ జిల్లా పేరూర్‌ బడ్డీశ్వరాలయంలో కల్యాణి అనే ఏనుగు స్నానం చేసేందుకు అనుకూలంగా రూ.60 లక్షలతో నిర్మించిన నీటితొట్టెను మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పేరూర్‌ ఆధీనంలో ఉన్న అర్చకులు, గురుకులం శిక్షణ పాఠశాలలో శిక్షణ పూర్తిచేసిన 84 మంది విద్యార్థులకు శివదీక్ష దృవపత్రాలు మంత్రి అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హిందూ దేవాదాయ శాఖ నిర్వహణలోని 27 ఆలయాల్లో 29 ఏనుగులను సంరక్షిస్తున్నట్లు తెలిపారు. త్వరలో 17 ఆలయాలకు దర్మకర్తలను నియమిస్తామని, మరుదమలై మురుగన్‌ ఆలయంలో భక్తుల సౌకర్యార్ధం లిఫ్ట్‌ ఏర్పాటుపనులను వచ్చే నెలలో చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

ఇదికూడా చదవండి: ‘బీజేపీ-అన్నాడీఎంకే’లా కాపురం చేయొద్దు

Updated Date - 2023-02-09T11:19:20+05:30 IST