Share News

Minister: రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు లేవు..

ABN , Publish Date - Dec 17 , 2023 | 09:16 AM

పొరుగు రాష్ట్రమైన కేరళలో కొత్తగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయని, కానీ, తమిళనాడులో నమోదు కావడం

Minister: రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు లేవు..

- ఆరోగ్య మంత్రి ఎం.సుబ్రమణ్యం

అడయార్‌(చెన్నై): పొరుగు రాష్ట్రమైన కేరళలో కొత్తగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయని, కానీ, తమిళనాడులో నమోదు కావడం లేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 98 శాతం మందికి కరోనా టీకాలు వేశామన్నారు. అందువల్ల వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు వెలుగు చూస్తున్నందున అధిక జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటితో బాధపడేవారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తామన్నారు. ఆ నమూనాలను అధ్యయనం చేసి తగిన చర్యలు చేపడుతామన్నారు. ఎలాంటి వైర్‌సగా రూపాంతరం చెందిందో గుర్తించి, వారం రోజుల్లో వెల్లడిస్తామన్నారు. అయితే, ఈ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు అందరికీ అక్కర్లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఆందోళన ఎక్కడా లేదని మంత్రి సుబ్రమణ్యం తెలిపారు.

ఆరోగ్య శాఖ కార్యదర్శి గగన్‌దీ్‌ప సింగ్‌ బేదీ మాట్లాడుతూ... రాష్ట్రంలో విస్తరిస్తున్న ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ గురించి అధ్యయనం చేస్తున్నామన్నారు. సీజన్‌ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించామన్నారు. ప్రతి రోజూ 300 ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ అవసరమైన వారికి వారి ఇళ్ల వద్దే వైద్యం అందిస్తున్నామన్నారు. అదేసమయంలో వైర్‌సతో బాధపడేవారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్కు ధరించాలని సూచించారు. జ్వర లక్షణాలు ఉన్నవారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే తగిన చికిత్స చేసుకోవాలని కోరారు. కరోనా కేసులు వెలుగు చూస్తున్న కేరళ రాష్ట్రం నుంచి రాష్ట్రానికి భారీగా తరలివస్తున్న శబరిమలై అయ్యప్ప భక్తులను చూసి ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 09:16 AM