Share News

Zoramthanga: గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన సీఎం

ABN , First Publish Date - 2023-12-04T18:25:33+05:30 IST

ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తూ మిజోరం ముఖ్యమంత్రి జోరంతాంగ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ డాక్టర్ హరిబాబు కుంభంపాటికి అందజేశారు. ఆయన రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సోమవారంనాడు వెలువడిన మిజోరం ఎన్నికల ఫలితాల్లో జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ మొత్తం 40 స్థానాలకు 27 స్థానాల్లో గెలుపొంది అధికారం ఖాయం చేసుకుంది.

Zoramthanga: గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన సీఎం

ఐజ్వాల్: ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తూ మిజోరం (Mizoram) ముఖ్యమంత్రి జోరంతాంగ (Zoramthang) తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ డాక్టర్ హరిబాబు కుంభంపాటికి అందజేశారు. ఆయన రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సోమవారంనాడు వెలువడిన మిజోరం ఎన్నికల ఫలితాల్లో జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) మొత్తం 40 స్థానాలకు 27 స్థానాల్లో గెలుపొంది అధికారం ఖాయం చేసుకుంది. జోరంతాంగ సారథ్యంలోని మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎప్) 10 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 2, కాంగ్రెస్ 1 సీటు గెలుచుకున్నాయి.


ప్రభుత్వ వ్యతిరేకతే కారణం: జోరంతాంగ

ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం జోరంతాంగ మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నట్టు చెప్పారు. ''ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజలు నా పనితీరుపై సంతృప్తి చెందకపోవడం ఓటమికి కారణాలు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నాను. తదుపరి ప్రభుత్వం బాగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను. ప్రభుత్వ వ్యతిరేకత, కోవిడ్ విరుచుకుపడటం వంటివి మా ఓటమికి కారణాలు అనుకుంటున్నాను'' అని తెలిపారు.

Updated Date - 2023-12-04T18:25:34+05:30 IST