MLAs: టాటా.. వీడుకోలు.. గుడ్ బై.. ఇంక సెలవు
ABN , First Publish Date - 2023-02-21T12:33:54+05:30 IST
కర్ణాటక 15వ శాసనసభ చిట్టచివరి సమావేశాలు ఈ నెల 24తో ముగియనుండడంతో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి
- 15వ శాసనసభ సభ్యుల గ్రూప్ ఫొటో
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కర్ణాటక 15వ శాసనసభ చిట్టచివరి సమావేశాలు ఈ నెల 24తో ముగియనుండడంతో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai)తో కలిసి మంత్రులు, సభ్యులు గ్రూప్ ఫొటో దిగారు. ముఖ్యమంత్రి బొమ్మై పక్కనే ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ఆశీనులు కాగా స్పీకర్ విశ్వేశ్వరహెగ్డే కాగేరి, ఆయన పక్కనే మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడియూరప్ప(Former Chief Minister BS Yeddyurappa), జగదీష్ శెట్టర్ కూర్చున్నారు. చివరి గ్రూప్ ఫొటోకు డజను మందికి పైగా ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారని సచివాలయ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి, ఆయన సోదరుడు మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ కూడా గ్రూప్ ఫొటో కార్యక్రమానికి హాజరు కాలేదు.