Delhi: మోదీ సర్కారు 9 ఏళ్ల పాలనపై దేశవ్యాప్త ప్రచారం..
ABN , First Publish Date - 2023-04-17T12:00:58+05:30 IST
ఢిల్లీ: నరేంద్రమోదీ సర్కారు (Modi Govt.) తొమ్మిదేళ్ళ పాలనపై దేశవ్యాప్త ప్రచారం చేయడానికి బీజేపీ (BJP) అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ: నరేంద్రమోదీ సర్కారు (Modi Govt.) తొమ్మిదేళ్ళ పాలనపై దేశవ్యాప్త ప్రచారం చేయడానికి బీజేపీ (BJP) అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మే 15 నుంచి జూన్ 15 వరకు నెలరోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనుంది. ప్రభుత్వ పథకాలు, లబ్దిదారులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు కార్యక్రమాలపై ప్రచారం చేయాలని బీజేపీ ఎంపీలందరికీ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో విస్తృతస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేలా కమలనాథులు ప్రణాళికలు రూపొందించారు.
ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యులు, క్రీడాకారులు, కళాకారులు, వ్యాపారులు, వ్యాపారుల వంటి నిపుణులను సంప్రదించాలని అధిష్టానం సూచించింది. మోదీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో టచ్‌లో ఉండాలని, వారి జీవితంలో వచ్చిన మార్పులను అందరికీ తెలిసేలా కార్యక్రమాలను రూపొందించాలని ఆదేశించింది.
అలాగే కొత్త ఓటర్లను సంప్రదించాలని, మత పెద్దలు, మాజీ సైనికులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు మొదలైన వారిని సంప్రదించాలని అధిష్టానం సూచించింది. రైతులు, కూలీలు, పేదలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, మహిళలు, యువత, గ్రామీణాభివృద్ధి కోసం చేసిన పనులను ప్రచారం చేయాలంది. ఈ ప్రచారం కింద చేపడుతున్న కార్యక్రమాల గురించి అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా సమాచారాన్ని ప్రొఫార్మాలో నింపాలని ఎంపీలకు అధిష్టానం ఆదేశించింది.