Share News

MP CM Oath: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2023-12-13T14:49:32+05:30 IST

మధ్యప్రదేశ్ 19వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మోహన్ యాదవ్ బుధవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా , బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

MP CM Oath: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం

భోపాల్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) 19వ ముఖ్యమంత్రిగా బీజేపీ (BJP) నేత మోహన్ యాదవ్ (Mohan Yadav) బుధవారంనాడు ప్రమాణ స్వీకారం (Sworn) చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah), బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రులుగా రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవ్డా కూడా ప్రమాణ స్వీకారం చేశారు.


సీఎంగా ప్రమాణస్వీకారానికి ముందు మోహన్ యాదవ్ (58) భోపాల్‌లోని ఒక ఆలయాన్ని సందర్శించారు. బీజేపీ కార్యాలయానికి వెళ్లి జన్‌సంఘ్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, బీజేపీ సిద్ధాంతకర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఘనంగా నివాళులర్పించారు.


రాజా విక్రమాదిత పట్టణం నుంచి వచ్చా...

అత్యుత్తమ పాలన అందించిన రాజా విక్రమాదిత్య పట్టణం (ఉజ్జయిని) నుంచి తాను వచ్చానని, ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నానని ఈ సందర్భగా యాదవ్ చెప్పారు. మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులకు ఈ గడ్డపై నుంచి సాదర స్వాగతం పలుకుతున్నానని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతాక్రమాలపై అడిగినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం, ఎంప్లాయింట్ రంగంలో ప్రగతిపై దృష్టి సారిస్తామని, అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. కాగా, ఉజ్జయిని సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా యాదవ్ వరుసగా మూడు సార్లు (2013, 2018, 2023) గెలిచారు.

Updated Date - 2023-12-13T14:49:33+05:30 IST