Cabinet Expansion: అసెంబ్లీ ఎన్నికల వేళ మంత్రివర్గ విస్తరణ.. కొత్తగా ముగ్గురికి చోటు

ABN , First Publish Date - 2023-08-26T17:12:27+05:30 IST

మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్తగా ముగ్గురికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. భోపాల్‌లోని రాజ్‌భవన్‌లో శనివారంనాడు ముగ్గురు కొత్త మంత్రులతో గవర్నర్ మంగుభాయ్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు. కొత్త మంత్రులలో రాజేంద్ర శుక్లా, గౌరీశంకర్ బైసెన్, రాహుల్ సింగ్ లోథి ఉన్నారు.

Cabinet Expansion: అసెంబ్లీ ఎన్నికల వేళ మంత్రివర్గ విస్తరణ.. కొత్తగా ముగ్గురికి చోటు

భోపాల్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్తగా ముగ్గురికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj singh chouhan) తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణ చేపట్టారు. భోపాల్‌లోని రాజ్‌భవన్‌లో శనివారంనాడు ముగ్గురు కొత్త మంత్రులతో గవర్నర్ మంగుభాయ్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు. కొత్తగా మంత్రివర్గంలో చేరిన వారిలో రాజేంద్ర శుక్లా, గౌరీశంకర్ బైసెన్, రాహుల్ సింగ్ లోథి ఉన్నారు.


మంత్రుల వివరాలు..

రాజేంద్ర శుక్లా మధ్యప్రదేశ్‌లోని రేవా నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో వాణిజ్యం, పరిశ్రమలు, ఉపాధి శాఖ మంత్రిగా పనిచేశారు. రేవాకు చెందిన శుక్లా సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేశారు. 1995లో బీజేపీ సభ్యుడిగా తన రాజకీయ కెరీర్ ప్రారంభించారు. 2008లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. రాష్ట్ర మంత్రి పదవి చేపట్టారు. రేవాలో జనాదరణ కలిగిన నేతగా ఆయనకు పేరుంది. విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల అభివృద్ధి రంగంలో ఆయన చేసిన పనులు ప్రశంసలు అందుకున్నాయి.


కాగా, గౌరీ శంకర్ బైసెన్ 2008 నుంచి బాలాఘాట్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. మధ్యప్రదేశ్ బీసీ కమిషన్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. 1990లో బీజేపీలో చేరి, 2008,2013లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యరు. 2013 నుంచి 2018 వరకూ క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. 2021లో మధ్యప్రదేశ్ బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. అవినీతి, అనుచిత ప్రవర్తన వంటి ఆరోపణలతో వివాదాస్పద వ్యక్తిగా ఆయనకు పేరుంది. అయినప్పటికీ, బీజేపీలోనూ పేరున్న నేతగానే కాకుండా, ముఖ్యమంత్రి పదవికి పోటీదారుల్లో ఒకరిగా ఉన్నారు.


మరోవైపు, రాహుల్ సింగ్ లోథీ కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమాభారతి మేనల్లుడు. 2018 ఎన్నికల్లో ఖరగ్‌పూర్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలుత ఆయన కాంగ్రెస్ సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించి 2009లో నర్సింగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2018లో బీజేపీలో చేరి ఖరగ్‌పూర్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. లోథి ఎన్నిక చెల్లదని 2022లో మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రకటించింది. ఆ తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. 2021 మేలో దమోద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీచేసి తిరిగి ఎమ్మెల్యేగా ఉన్నికయ్యారు.

Updated Date - 2023-08-26T17:12:27+05:30 IST