Lalbaugcha Raja: లాల్‌బాగ్చా గణేష్‌కు 3 రోజుల్లో రూ.కోటిన్నర విరాళం

ABN , First Publish Date - 2023-09-23T18:18:44+05:30 IST

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని అతి పురాతన, అత్యంత ప్రసిద్ధి చెందిన గణేష్ మండపాల్లో ఒకటైన లాల్‌బాగ్చా రాజాకు విరాళాలు పోటెత్తుతున్నాయి. కేవలం మూడు రోజుల్లో రూ.1.59 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. వీటితో పాటు 879.53 గ్రామాల బంగారం, 17,534 గ్రాముల వెండి డొనేషన్లు అందాయి.

Lalbaugcha Raja: లాల్‌బాగ్చా గణేష్‌కు 3 రోజుల్లో రూ.కోటిన్నర విరాళం

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని అతి పురాతన, అత్యంత ప్రసిద్ధి చెందిన గణేష్ మండపాల్లో ఒకటైన లాల్‌బాగ్చా రాజా (Lalbaugcha Raja)కు విరాళాలు పోటెత్తుతున్నాయి. కేవలం మూడు రోజుల్లో రూ.1.59 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. వీటితో పాటు 879.53 గ్రామాల బంగారం, 17,534 గ్రాముల వెండి డొనేషన్లు అందాయి. ఉత్సవం రెండో రోజు రూ.60 లక్షలకు పైగా విరాళాలను లాల్‌బాగ్జా గణేష్‌కు భక్తులు సమర్పించుకున్నారు.


ముంబైలోని ప్రసిద్ధ గణేష్ మండపాల్లో ఒకటైనా లాల్‌బాగ్చా రాజాను చూసేందుకు ఏటా పెద్ద సంఖ్యలో సెలబ్రెటీలు, రాజకీయనాయకులు, వ్యాపార దిగ్గజాలతోపాటు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ శుక్రవారంనాడు తన కుటుంబ సభ్యులతో కలిసి గణపతిని సందర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. 1934లో పుత్లాబాయ్ ఛావల్‌లో లాల్‌బాగ్చా సార్వజనిక్ గణోత్సవ మండపాన్ని తొలిసారి ఏర్పాటు చేశారు. కాంబ్లి కుటుంబసభ్యులు 8 దశాబ్దాలకు పైగా ఈ గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 19న ప్రారంభమైన పది రోజుల గణేష్ ఉత్సవాలు అనంత చతుర్దశితో ముగియనున్నాయి. సెప్టెంబర్ 29న నిమజ్జనం జరుగుతుంది.

Updated Date - 2023-09-23T18:18:44+05:30 IST