Supriya Sule: ప్రమాదవశాత్తూ చీరకు మంటలు

ABN , First Publish Date - 2023-01-15T19:59:02+05:30 IST

మహారాష్ట్రలోని పుణెలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే చీరకు..

Supriya Sule: ప్రమాదవశాత్తూ చీరకు మంటలు

పుణె: మహారాష్ట్రలోని పుణెలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) చీరకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. వెంటనే ఆమె అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. తాను క్షేమంగానే ఉన్నానని, కంగారు పడాల్సిన పని లేదని ఆ తర్వాత సుప్రియా సూలే ట్వీట్ చేశారు. హింజవాడిలో కరాటే పోటీలను ప్రారంభించేందుకు బారామతి ఎంపీ సుప్రియ వచ్చారు. వేదికపై ఉన్న ఛత్రపతి శివాజీ చిన్న విగ్రహానికి పూలమాల వేస్తుండగా అక్కడే ఉంచిన దీపపు కుందెపై ఆమె చీర చెంగు పడింది. ఆ విషయం గ్రహించిన వెంటనే అప్రమత్తమపై తన చేతులతోనే మంటలను ఆర్పేశారు. దీంతో అక్కడున్న వారంతా తేలిగ్గా ఊపిరిపీల్చుకున్నారు.

కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఎంపీ వెంటనే ఓ ట్వీట్‌లో తన క్షేమసమాచారం తెలియజేశారు. సకాలంలో మంటలను ఆర్పేయడంతో ప్రమాదం జరగలేదని, శ్రేయోభిలాషులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆ ట్వీట్‌లో తెలిపారు. కాగా, సొంత నియోజవర్గం బారామతిలో పర్యటించేందుకు వచ్చిన సుప్రియ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారని, కరాటే పోటీల తర్వాత కూడా ఆమె పలు కార్యక్రమాలకు వెళ్లారని ఆమె కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2023-01-15T20:05:21+05:30 IST