Nitin Gadkari: కేంద్ర మంత్రి గడ్కరీకి బెదిరింపు... రూ. 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్

ABN , First Publish Date - 2023-03-21T22:06:46+05:30 IST

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపులు వచ్చాయి.

Nitin Gadkari: కేంద్ర మంత్రి గడ్కరీకి బెదిరింపు... రూ.  10 కోట్లు ఇవ్వాలని డిమాండ్
Nitin Gadkari

నాగ్‌పూర్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari)కి బెదిరింపులు వచ్చాయి. 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని లేకుంటే ఆయన ప్రాణాలకు హాని కలిగిస్తామంటూ నాగ్‌పూర్‌(Nagpur)లోని కార్యాలయానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మంగళూరు(Mangaluru)కు చెందిన ఓ మహిళ నెంబర్ నుంచి జయేశ్ పూజారి పేరిట ఈ ఫోన్ కాల్స్ వచ్చినట్లు నాగ్‌పూర్ డీసీపీ రాహుల్ తెలిపారు. మంగళూరుకు చెందిన ఆ మహిళ ఈవెంట్ మేనేజర్ అని తేలింది. మరోవైపు జయేశ్ పూజారీ(Jayesh Pujari) ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. తనకు ఈ బెదిరింపు ఫోన్‌కాల్స్‌కు సంబంధం లేదని పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

బెదిరింపు కాల్స్ నేపథ్యంలో గడ్కరీ నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2023-03-21T22:09:57+05:30 IST