No-confidence motion : నలుపు రంగు దుస్తులతో పార్లమెంటుకు ఇండియా కూటమి ఎంపీలు

ABN , First Publish Date - 2023-07-27T09:52:25+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు ఇండియా కూటమి ఎంపీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మణిపూర్ సమస్యపై మోదీ ప్రకటన చేయాలని పట్టుబడుతూ, తమ నిరసనను మరింత తీవ్రంగా వ్యక్తం చేసేందుకు నల్ల దుస్తులతో పార్లమెంటుకు హాజరవాలని నిర్ణయించారు.

No-confidence motion : నలుపు రంగు దుస్తులతో పార్లమెంటుకు ఇండియా కూటమి ఎంపీలు

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు ఇండియా (I.N.D.I.A) కూటమి ఎంపీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మణిపూర్ సమస్యపై మోదీ ప్రకటన చేయాలని పట్టుబడుతూ, తమ నిరసనను మరింత తీవ్రంగా వ్యక్తం చేసేందుకు నల్ల దుస్తులతో పార్లమెంటుకు హాజరవాలని నిర్ణయించారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ సమస్యపై మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చర్చకు సిద్ధమేనని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఈ నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానాలకు నోటీసులను వేర్వేరుగా లోక్‌సభలో సమర్పించాయి. కాంగ్రెస్ ఇచ్చిన నోటీసును లోక్ సభ సభాపతి ఓం బిర్లా అనుమతించారు. అన్ని పార్టీలతో చర్చించి, అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీని, సమయాన్ని నిర్ణయిస్తానని తెలిపారు.


ఇదిలావుండగా, చైనాతో సరిహద్దు సమస్యను లోక్ సభలో చర్చించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ గురువారం వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు. జీరో అవర్, క్వశ్చన్ అవర్, ఇతర కార్యకలాపాలను నిలిపేసి, చైనాతో సరిహద్దు పరిస్థితిపై చర్చించాలని కోరారు.

ప్రతిపక్షాలు రాజ్య సభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశాలను బహిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.


ఇవి కూడా చదవండి :

Puducherry: గర్భవతిని చేస్తే రూ.25 లక్షలు

Annamalai: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. రూ.5,600 కోట్ల కుంభకోణాలు జరిగాయి..

Updated Date - 2023-07-27T09:52:25+05:30 IST