Yogi Adityanath: ఆందోళన చెందవద్దు... జనతా దర్శన్‌లో ప్రజలకు సీఎం అభయం
ABN , First Publish Date - 2023-02-03T07:32:50+05:30 IST
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జనతా దర్శన్ కార్యక్రమంలో ప్రజలకు అభయం...
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జనతా దర్శన్ కార్యక్రమంలో ప్రజలకు అభయం ఇచ్చారు.(Yogi Adityanath) గోరఖ్‌నాథ్ ఆలయంలోని మహంత్ దిగ్విజయ్ నాథ్ స్మృతి ఆడిటోరియంలో జరిగిన జనతా దర్శన్ కార్యక్రమంలో 300 మంది ప్రజల సమస్యలను విని, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను సీఎం యోగి ఆదేశించారు.‘‘సమస్య ఏదైనా సరే, నేను ఉన్నంత వరకు మీరు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు(No Need to Worry), అందరి సమస్యలకు న్యాయమైన పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం, డబ్బు లేకపోవడంతో ఎవరి చికిత్సకు ఆటంకం కలగదు,మాఫియా ఎవరి భూమిని కబ్జా చేయదు’’ అని సీఎం ప్రజలకు(People) అభయమిచ్చారు.
భూ సమస్య గురించి సీఎంకు ఫిర్యాదు చేసిన ఓ మహిళ తాను తిరిగి ఇంటికి వెళ్లేందుకు బస్సు చార్జీలు కూడా లేవని చెప్పడంతో ఆమెకు రవాణ చార్జీలు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. జనతా దర్శన్‌లో భూవివాదాలు, ఆక్రమణలు, భూముల రిజిస్ట్రేషన్‌లో అవకతవకలకు సంబంధించిన ఫిర్యాదులతో పాటు తీవ్రమైన వ్యాధుల చికిత్సకు ఆర్థిక సహాయం అందించాలనే డిమాండ్లతో ప్రజలు సీఎం వద్దకు వచ్చారు.
భూములను కబ్జా చేసే మాఫియాకు గుణపాఠం చెబుతామని సీఎం హెచ్చరించారు. రోగుల చికిత్సకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం యోగి చెప్పారు. జనతా దర్శన్‌లో తల్లులకు తోడుగా వస్తున్న చిన్నారులపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రేమాభిమానాలు కురిపించారు. పిల్లల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం యోగి వారికి చాక్లెట్లు ఇచ్చి చదువుకోవాలని ప్రోత్సహించారు.