Karnataka minister MB Patil: సిద్ధరామయ్య, శివకుమార్‌ల మధ్య పవర్ షేరింగ్ ఫార్ములా లేదు
ABN , First Publish Date - 2023-05-23T12:21:32+05:30 IST
కర్ణాటక కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ నాయకుడు ఎంబి పాటిల్ తాజాగా అధికారం పంచుకునే విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య, డికె శివకుమార్ మధ్య అధికారాన్ని పంచుకునే సూత్రం లేదని పాటిల్ పేర్కొన్నారు....
బెంగళూరు: కర్ణాటక కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ నాయకుడు ఎంబి పాటిల్ తాజాగా అధికారం పంచుకునే విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య, డికె శివకుమార్ మధ్య అధికారాన్ని పంచుకునే సూత్రం లేదని పాటిల్ పేర్కొన్నారు.(Karnataka minister MB Patil)అధికార భాగస్వామ్య ఫార్ములా ఉంటే పార్టీ హైకమాండ్‌కు తెలియజేసి ఉండేదని పాటిల్ చెప్పారు.(No power sharing formula)తమ మధ్య అధికారం పంచుకునే ఫార్ములా ఉంటే హైకమాండ్ ప్రకటించి ఉండేదని, సిద్ధరామయ్య ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉంటారని పాటిల్ స్పష్టం చేశారు.(Siddaramaiah, DK Shivakumar)కాగా సిఎం పదవిని సిద్ధరామయ్య, శివకుమార్‌లు ఒక్కొక్కరు 30 నెలల పాటు పంచుకుంటారని, అలాగే వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల వరకు కెపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.మే 10వతేదీన జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గాను 135 స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీజేపీ 66 సీట్లతో రెండో స్థానంలో నిలవగా, కింగ్‌మేకర్‌గా బరిలోకి దిగాలని భావించిన జేడీ(ఎస్) కేవలం 19 సీట్లతో పతనమైంది.