Gehlot Vs MHA: 'హెలికాప్టర్' వ్యవహారంలో సీఎం, హోం శాఖ లడాయి..?

ABN , First Publish Date - 2023-09-09T16:44:01+05:30 IST

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు చేదు అనుభవం ఎదురైంది. బాబా శ్రీ ఖిన్వదాస్ జీ మహరాజ్ వర్దంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు సికార్‌లోని సాంగ్లియా పీఠానికి ఆయన వెళ్లాల్సి ఉండగా ఆయన హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరించారు. గగనతల ఆంక్షల పేరుతో తన హెలికాప్టర్‌కు హోం మంత్రిత్వ శాఖ అనుమతించ లేదంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే, ఆయన వాదనను హోం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది.

Gehlot Vs MHA: 'హెలికాప్టర్' వ్యవహారంలో సీఎం, హోం శాఖ లడాయి..?

న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot)కు చేదు అనుభవం ఎదురైంది. షెడ్యూల్ ప్రకారం బాబా శ్రీ ఖిన్వదాస్ జీ మహరాజ్ వర్దంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు సికార్‌లోని సాంగ్లియా పీఠానికి ఆయన వెళ్లాల్సి ఉండగా ఆయన హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరించారు. గగనతల ఆంక్షల పేరుతో తన హెలికాప్టర్‌కు హోం మంత్రిత్వ శాఖ అనుమతించ లేదంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే, ఆయన వాదనను హోం మంత్రిత్వ శాఖ శనివారంనాడు ఒక ప్రకటనలో తోసిపుచ్చింది.


''హెలికాప్టర్‌కు అనుమతించడం లేదంటూ రాజస్థాన్ సీఎం చెప్పినట్టు ఒక వార్త వచ్చింది. ఫ్లయిట్ పర్మిషన్ కోరుతూ రాజస్థాన్ సీఎం నుంచి నాలుగు విజ్ఞప్తులు వచ్చాయి. అందులో సికార్ ఒకటి. నాలుగింటికీ ఎంహెచ్ఏ అనుమతి ఇచ్చింది'' అని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజస్థాన్ సీఎం చేసిన ఏ ఒక్క విజ్ఞప్తిని తాము తోసిపుచ్చలేదని, అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, గవర్నర్లు, రాష్ట్ర ముఖమంత్రులు పర్యటించే స్టేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అనుమతించాం'' అని ఆ ప్రకటన తెలిపింది.


దీనికి ముందు, అశోక్ గెహ్లాట్ ఒక ప్రకటనలో ఉదయ్‌పూర్ నుంచి సికార్‌కు హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉండగా తనకు హోం మంత్రిత్వ శాఖ అనుమతించలేదని, దాంతో ఆ ప్రోగ్రాం రద్దు చేసుకున్నానని చెప్పారు. జీ-20 సమావేశం కారణంగా తన హెలికాప్టర్‌కు హోం శాఖ, భారత ప్రభుత్వం అనుమతించలేదన్నారు.

Updated Date - 2023-09-09T16:44:01+05:30 IST