Earthquake : భూకంపంతో వణికిన జమ్మూ-కశ్మీరు, ఢిల్లీ
ABN , First Publish Date - 2023-06-13T14:28:17+05:30 IST
దేశ రాజధాని నగరం ఢిల్లీ, జమ్మూ-కశ్మీరు తదితర ఉత్తరాది ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం భూమి కంపించింది. జమ్మూ-కశ్మీరులోని కీస్త్వర్‌కు ఆగ్నేయ దిశలో 30 కిలోమీటర్ల దూరంలో 5.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. యూరోపియన్-మెడిటెర్రేనియన్ సీస్మొలాజికల్ సెంటర్ ఈ వివరాలను తెలిపింది.
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీ, జమ్మూ-కశ్మీరు తదితర ఉత్తరాది ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం భూమి కంపించింది. జమ్మూ-కశ్మీరులోని కీస్త్వర్‌కు ఆగ్నేయ దిశలో 30 కిలోమీటర్ల దూరంలో 5.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. యూరోపియన్-మెడిటెర్రేనియన్ సీస్మొలాజికల్ సెంటర్ ఈ వివరాలను తెలిపింది.
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు ఉత్తర దిశలో 99 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం ఏర్పడిందని, భూమి లోపల 60 కిలోమీటర్ల లోతులో దీని కేంద్రం ఉందని తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు సంభవించిన ఈ భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలిపే సమాచారం లేదు.
అంతకుముందు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, మయన్మార్‌లో మంగళవారం తెల్లవారుజామున 2.53 గంటలకు 3.7 తీవ్రతతో భూమి కంపించింది. భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉంది. మే 31న కూడా మయన్మార్‌లో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఇవి కూడా చదవండి :
AIADMK Vs BJP : బీజేపీతో తెగదెంపులకు ఏఐఏడీఎంకే సిద్ధం?
Govt Vs Twitter : ట్విటర్ మాజీ సీఈఓ ఆరోపణలు పూర్తిగా అబద్ధం : కేంద్ర మంత్రి