Notice: మాజీ మంత్రికి సుప్రీంకోర్టు నోటీసు.. ఎందుకో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-02-15T12:42:38+05:30 IST
భూకబ్జా కేసులో అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి జయకుమార్(Former Minister Jayakumar)కు సుప్రీంకోర్టు నోటీసు జారీచేసింది. స్థానిక దురైప్పాక్కం
అడయార్(చెన్నై), ఫిబ్రవరి 14: భూకబ్జా కేసులో అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి జయకుమార్(Former Minister Jayakumar)కు సుప్రీంకోర్టు నోటీసు జారీచేసింది. స్థానిక దురైప్పాక్కంలో ఎనిమిది గ్రౌండ్ల స్థలం ఆక్రమణ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని అపెక్స్ కోర్టు మంగళవారం ఆదేశించింది. దురైప్పాక్కంకు చెందిన మహేష్(Mahesh) అనే వ్యక్తికి చెందిన ఈ ఎనిమిది గ్రౌండ్ల స్థలాన్ని గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జయకుమార్ తన అధికారాన్ని ఉపయోగించి ఆక్రమించుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బాధిత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ జయకుమార్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన హైకోర్టు మాజీ మంత్రికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పును రాష్ట్ర పోలీస్ శాఖ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా, విచారణకు స్వీకరించిన అపెక్స్ కోర్టు మాజీ మంత్రి జయకుమార్‌కు నోటీసు జారీచేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రిషికేస్ రాయ్, సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఇదికూడా చదవండి: గాలి జనార్దనరెడ్డిని ఈ మైనింగ్ వ్యాపారి అంత మాట అనేశారేంటి..?