Heat wave:ఒడిశాలో తీవ్రమైన వేడిగాలులు...వచ్చే 5రోజులపాటు పాఠశాలలకు సెలవు

ABN , First Publish Date - 2023-04-12T14:13:40+05:30 IST

ఒడిశా రాష్ట్రంలో మండుతున్న ఎండలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది....

Heat wave:ఒడిశాలో తీవ్రమైన వేడిగాలులు...వచ్చే 5రోజులపాటు పాఠశాలలకు సెలవు
Closure schools due to intense Heatwave

భువనేశ్వర్ (ఒడిశా): ఒడిశా రాష్ట్రంలో మండుతున్న ఎండలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భువనేశ్వర్ నగరంలో 40 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత నమోదైంది. బారిపద నగరంలో ఉష్ణోగ్రత 41.6 డిగ్రీల సెల్షియస్, జార్సుగూడలో 41.5 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మండుతున్న ఎండలకు తోడు వేడి గాలులు వీస్తున్నాయి.దీంతో ఒడిశా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే ఐదు రోజుల పాటు సెలవు ప్రకటించారు.

ఇది కూడా చదవండి : Nirmala Sitharaman: ముస్లింలపై నిర్మలాసీతారామన్ వ్యాఖ్యలపై రాజుకున్న రచ్చ...ఒవైసీ కౌంటర్...అసలు అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే...

ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 9 రోజుల జపాన్ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వేడిగాలుల ప్రభావం వల్ల పాఠశాలలకు రాబోయే 5రోజుల పాటు సెలవు ప్రకటించారు. రాగల 5రోజుల్లో వేడిగాలుల తీవ్రత పెరుగుతోందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

Updated Date - 2023-04-12T14:13:40+05:30 IST