Odisha Train Accident: క్షతగాత్రులను పరామర్శించిన మోదీ

ABN , First Publish Date - 2023-06-03T17:46:43+05:30 IST

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో గాయపడి కటక్‌లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉండామని భరోసా ఇచ్చారు. వారికి అందుతున్న వైద్యసహాయాన్ని మంత్రులు, అధికారులతో కలిసి స్యయంగా సమీక్షించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Odisha Train Accident: క్షతగాత్రులను పరామర్శించిన మోదీ

న్యూఢిల్లీ: ఒడిశా (Odisha)లోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో గాయపడి కటక్‌లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narnedra Modi) శనివారం సాయంత్రం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉండామని భరోసా ఇచ్చారు. వారికి అందుతున్న వైద్యసహాయాన్ని మంత్రులు, అధికారులతో కలిసి స్యయంగా సమీక్షించారు. ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్ని కనీవినీ ఎరుగని మహావిషాదంలో సుమారు 288 మంది మృత్యువాత పడగా, 900 మంది వరకూ గాయపడి కటక్‌లోని పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. బాధితులను పరామర్శించే ముందు ప్రధాని నేరుగా ప్రమాద స్థలికి చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రైల్వే అధికారులతో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రైల్వే అధికారులు ప్రాథమిక నివేదికను ప్రధానికి వివరించారు. అనంతరం మోదీ నేరుగా కటక్ చేరుకుని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ఓదార్చారు.

మూడేళ్లలో ఒక్క ప్రమాదం జరగలేదు: ప్రహ్లాద్ జోషి

బాలాసోర్‌ రైలు ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. గత మూడేళ్లుగా ఒక్క రైలు ప్రమాద ఘటన కూడా చోటుచేసుకోలేదని తెలిపారు. బాలాసోర్ ఘటన తనకు, తమ ప్రభుత్వానికి ఎంతో ఆవేదన కలిగించిందని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ నిర్దేశకత్వంలో రైల్వే మంత్రి స్యయంగా ప్రమాద స్థలిలో ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తు్న్నారని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.

Updated Date - 2023-06-03T17:46:43+05:30 IST