Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 275: ఒడిశా సీఎస్

ABN , First Publish Date - 2023-06-05T08:37:38+05:30 IST

ఒడిశా రైలు ప్రమాదంలో(Odisha Train Accident) 275 మంది మృతిచెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ (Odisha CS Pradeep) అధికారికంగా ప్రకటించారు.

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 275: ఒడిశా సీఎస్

ఒడిశా రైలు ప్రమాదంలో(Odisha Train Accident) 275 మంది మృతిచెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ (Odisha CS Pradeep) అధికారికంగా ప్రకటించారు. కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించడం వల్ల మరణాలసంఖ్య 288గా వచ్చిందని చెప్పారు. కాగా.. 108 మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించాం, మిగిలిన 167 మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. ప్రత్యేక వైద్య బృందం డీఎన్‌ఏ పరీక్షలు(DNA) చేసి మృతదేహాన్ని గుర్తించే ప్రక్రియను ప్రారంభించిందన్నారు.

ఈ ప్రమాదంలో మొత్తం 1175 మంది గాయపడ్డారని ప్రదీప్ జెనా తెలిపారు. వీరిలో 336 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 382 మంది క్షతగాత్రులు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఒడిశా ప్రభుత్వ సీఎస్ ప్రదీప్ జేనా తెలిపారు.

కాగా.. రైలు ప్రమాద ఘటన జరిగిన ప్రదేశంలో ట్రాక్‌లను పూర్తిగా పునరుద్దరించారు రైల్వే అధికారులు. రైల్వే అధికారులు, ఘటన జరిగిన ెండు రోజుల్లోనే ట్రాక్‌లను తిరిగి అందుబాటులోకి తెచ్చారు. స్వయంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దగ్గరుండి ట్రాక్ పునరుద్దరణ పనులను పర్యవేక్షించారు.

Updated Date - 2023-06-05T08:37:38+05:30 IST