Ooty Hill Train: హరిత పథకంలో ‘కొండరైలు’

ABN , First Publish Date - 2023-08-22T08:25:33+05:30 IST

కేంద్రప్రభుత్వ హరిత రైళ్ల పథకం కింద నీలగిరి కొండ రైలును హైడ్రోజన్‌ ఇంధనంతో నడపనున్నట్లు సేలం డివిజన్‌ రైల్వే అధికారులు తెలిపారు.

Ooty Hill Train: హరిత పథకంలో ‘కొండరైలు’

ఐసిఎఫ్‌(చెన్నై): కేంద్రప్రభుత్వ హరిత రైళ్ల పథకం కింద నీలగిరి కొండ రైలును హైడ్రోజన్‌ ఇంధనంతో నడపనున్నట్లు సేలం డివిజన్‌ రైల్వే అధికారులు తెలిపారు. నీలగిరి జిల్లా ఊటీ కొండ రైలు(Ooty Hill Train)లో ప్రయాణిం చేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. మేట్టుపాళయం - కున్నూరు(Mettupalayam - Coonoor) మధ్య మీటర్‌గేజీ మార్గంలో ‘ఎక్స్‌ క్లాస్‌’ ఇంజన్‌తో 15 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలులో పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్లడం దీని ప్రత్యేకత. ఈ రైలు నడిపేందు కు ప్రస్తుతం బర్నస్‌ ఆయిల్‌, డీజిల్‌ ఇంజిన్లు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రోజన్‌తో పని చేసేలా 8 ప్రాంతాల్లో 35 రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ నిర్వహించింది. అందులో ఊటీ - మేట్టుపాళయం, డార్జిలింగ్‌ - హిమాచల్‌ సహా 8 సంప్రదాయ రైళ్లను హరిత రైలు పథకంలో చేర్చింది.

Updated Date - 2023-08-22T08:25:35+05:30 IST