Operation Ajay: టెల్అవివ్ నుంచి 143 మందితో ఆరవ విమానం భారత్‌కు..
ABN , First Publish Date - 2023-10-22T18:50:53+05:30 IST
ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి భారతీయులను తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ అజయ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా 144 మందితో కూడిన ప్రత్యేక విమానం టెల్ అవివ్ నుంచి ఆదివారంనాడు బయలుదేరింది. ఇందులో ఇద్దరు నేపాలీ పౌరులు, నలుగురు శిశువులు కూడా ఉన్నారు.
టెల్ అవివ్: ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి భారతీయులను తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ అజయ్ (Operation Ajay) కొనసాగుతోంది. ఇందులో భాగంగా 144 మందితో కూడిన ప్రత్యేక విమానం టెల్ అవివ్ నుంచి ఆదివారంనాడు బయలుదేరింది. ఇందులో ఇద్దరు నేపాలీ పౌరులు, నలుగురు శిశువులు కూడా ఉన్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత 'ఆపరేషన్ అజయ్' పేరుతో భారత ప్రభుత్వం ఈ ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభించింది. తాజాగా 144 మందితో ఆరవ విమానం టెల్‌అవివ్ నుంచి బయలుదేరినట్టు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ (S.Jaishankar) సోషల్ మీడియా పోస్టులో తెలిపారు.
ఇంతవరకూ, టెల్ అవివ్ భారత్‌కు వచ్చిన వారి సంఖ్య 1,200కు చేరుతోంది. గత మంగళవారంనాడు ఢిల్లీకి చేరుకున్న ప్రత్యేక విమానంలో 18 మంది నేపాలీలు సైతం ఉన్నారు. ఇజ్రాయల్‌లోని భారతదేశ రాయబార కార్యాలయం ''ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్" ఆధారంగా ప్రయాణికులను ఎంపిక చేసి భారత్‌కు పంపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. వీరి ప్రయాణానికి అయ్యే ఖర్చులను భారత ప్రభుత్వమే భరిస్తోంది.