Owaisi: నితీష్‌కు అప్పుడే సెక్యులరిజం గుర్తొస్తుంది... ఒవైసీ ఫైర్..!

ABN , First Publish Date - 2023-04-10T16:35:39+05:30 IST

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి...

Owaisi: నితీష్‌కు అప్పుడే సెక్యులరిజం గుర్తొస్తుంది... ఒవైసీ ఫైర్..!

న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar)పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీ్న్ ఒవైసీ (Asaduddin Owaisi) మరోసారి విరుచుకుపడ్డారు. రామ నవమి శోభాయాత్రలో చేటుచేసుకున్న హింసకు నితీష్ సర్కార్‌దే బాధ్యతని అన్నారు. బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలోనే నితీష్‌కు సెక్యులరిజం (Secularism) గుర్తుకొస్తుందని అన్నారు. ఇఫ్తార్ పార్టీకి ఆతిథ్యం ఇస్తారనీ, కానీ అల్లర్లకు పాల్పడిన వారిపై మాత్రం చర్యలు తీసుకోరని విమర్శించారు.

''బీహార్ హింస కచ్చితంగా ముందస్తు వ్యూహం ప్రకారం జరిగినదే. ఊరేగింపులకు మీరు అనుమతి ఇచ్చారు. అల్లర్లు చోటుచేసుకున్నాయి. మీరు మౌన ప్రేక్షకుడిలా చూస్తుండిపోయారు. ప్రధాని పదవో, సీఎం పదవో కావాలనుకున్నప్పుడు మాత్రమే మీకు (నితీష్) సెక్యులరిజం గుర్తుకొస్తుంది. విద్యాధికులు అయిన ముస్లింలను అరెస్టు చేశారు. మాదగ్గర ఆ సమాచారం ఉంది'' అని ఒవైసీ అన్నారు. రాజస్థాన్‌లో రాజకీయ పరిస్థితి, సచిన్ పైలట్‌పై అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దొందూ దొందేనని, ఆ రెండు పార్టీల ప్రభుత్వాలు పనిచేయడం లేదని చాలా స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.

అక్కడ 50 విద్యేష ర్యాలీలు జరిగాయి..

మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితిపై మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 విద్వేష ర్యాలీలు జరిగాయని, ముస్లింలపై ద్వేషం వెళ్లగక్కారని ఆరోపించారు. హిందుత్వంపై ఎవరికి వారే తాము పెద్ద నేతగా నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ ఏ ఒక్కరూ నిరుద్యోగం, అవినీతిపై మాట్లాడటం లేదని అన్నారు. 1992 డిసెంబర్ 6న జరిగిన ఘటనను తాము ఎప్పటికీ మరచిపోమని కూడా ఒవైసీ పేర్కొన్నారు.

Updated Date - 2023-04-10T16:35:39+05:30 IST