Telangana results: తండ్రీకొడుకులకు ప్రజలే గుణపాఠం చెప్పారు: డీకే శివకుమార్
ABN , First Publish Date - 2023-12-03T15:29:20+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ కట్టబెట్టడం ద్వారా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, బీఆర్ఎస్ నేత కేటీ రామారావుకు తగిన జవాబు చెప్పారని అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly election) కాంగ్రెస్ (Congress) పార్టీకి ప్రజలు పట్టం కట్టడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ కట్టబెట్టడం ద్వారా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, బీఆర్ఎస్ నేత కేటీ రామారావుకు తగిన జవాబు చెప్పారని అన్నారు. కాంగ్రెస్కు విజయం చేకూర్చిన తెలంగాణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
''తెలంగాణ ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. మార్పును కోరుకున్నారు. ప్రగతి, అభివృద్ధి దిశగా మార్పును ఆకాంక్షించారు'' అని డీకే చెప్పారు. యువ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారని అడిగిన ప్రశ్నకు, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నారని, ఆయన టీమ్ లీడర్ అని, సీఎం ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. సమష్టి నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోరాటం చేసిందని, కేసీఆర్, కేటీఆర్ల గురించి తాను వ్యాఖ్యానించనని అన్నారు. తెలంగాణ ప్రజలు వారికి సమాధానం ఇచ్చారని చెప్పారు.