Plastic bottle: ప్లాస్టిక్ బాటిల్ తిరిగి ఇస్తే రూ.10 ఇస్తాం...
ABN , First Publish Date - 2023-11-15T07:41:59+05:30 IST
వినియోగించిన ప్లాస్టిక్ బాటిల్ తిరిగి అందిస్తే రూ.10 ఇస్తామని వండలూరు జూ పార్కు(Vandalur Zoo Park Officers) అధికారులు తెలిపారు.
ఐసిఎఫ్(చెన్నై): వినియోగించిన ప్లాస్టిక్ బాటిల్ తిరిగి అందిస్తే రూ.10 ఇస్తామని వండలూరు జూ పార్కు(Vandalur Zoo Park Officers) అధికారులు తెలిపారు. 2 వేలకు పైగా వన్యమృగాలు, పక్షులున్న ఈ పార్కును వారపు దినాల్లో 3 వేల మంది, సెలవు రోజుల్లో సుమారు 9 వేల మంది వరకు సందర్శిస్తుంటారు. ప్లాస్టిక్ వినియోగాన్ని అడ్డుకొనేలా పార్కు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రవేశ ద్వారంలోనే సందర్శకులు తీసుకొచ్చే వస్తువులు తనిఖీ చేసి ప్లాస్టిక్ సంచుల్లో తీసుకొచ్చే ఆహార పదార్థాలను పేపర్ సంచుల్లోకి మార్చి అందిస్తున్నారు. అలాగే, జంతువుల బోన్లు, పార్కులో ప్లాస్టిక్ బాటిల్ పారవేయడాన్ని అడ్డుకొనేలా కొత్త విధానం అమల్లోకి తీసుకొచ్చారు. సందర్శకులు తీసుకొచ్చే ప్లాస్టిక్ బాటిల్‌పై స్టిక్కర్లు అంటించి రూ.10 రుసుము వసూలు చేస్తున్నారు. వారు తిరిగి వెళ్లే సమయంలో ఆ బాటిల్ అందిస్తే రూ.10 తిరిగి ఇస్తున్నారు.