Odisha Train Accident: రైలు ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని

ABN , First Publish Date - 2023-06-03T16:44:16+05:30 IST

ఒడిశాలో కనీవినీ ఎరుగని మహా విషాదం చోటుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాద స్థలిని శనివారంనాడు సందర్శించారు. పరిస్థితిని సమీక్షిస్తు్న్న కేంద్రం మంత్రులు, రైల్వే అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముమ్మరంగా జరుగుతున్న సహాయక ఏర్పాట్లను పర్వవేక్షించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పరిస్థితిని సమీక్షించారు.

Odisha Train Accident: రైలు ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని

బాలాసోర్: ఒడిశా (Odisha)లో కనీవినీ ఎరుగని మహా విషాదం చోటుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రమాద స్థలిని శనివారంనాడు సందర్శించారు. పరిస్థితిని సమీక్షిస్తు్న్న కేంద్రం మంత్రులు, రైల్వే అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముమ్మరంగా జరుగుతున్న సహాయక ఏర్పాట్లను పర్వవేక్షించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాథమిక నివేదిక వివరాలను ప్రధానికి వివరించారు. అనంతరం కటక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సందర్శించేందుకు ప్రధాని వెళ్లారు. శుక్రవారంనాడు బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 278 మంది దుర్మరణం పాలయ్యారు, 900 మందికి పైగా గాయపడ్డారు.

సిగ్నలింగ్ వైఫల్యమే కారణం?

కాగా, సిగ్నలింగ్ సిగ్నలింగ్ వైఫల్యమే ఒడిశా రైలు ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒడిశా రైలు ప్రమాదం సిగ్నలింగ్ వైఫల్యం ఫలితంగా జరిగిందని శనివారం అధికారుల సంయుక్త తనిఖీ నివేదిక పేర్కొంది. (Signalling failure caused Odisha train accident) రైలు నంబర్ 12841కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కు అప్ మెయిన్ లైన్ కోసం సిగ్నల్ ఇచ్చారు. కానీ రైలు లూప్ లైన్‌లోకి ప్రవేశించి, అప్ లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలుతో ఢీకొని పట్టాలు తప్పిందని ప్రాథమిక నివేదిక (preliminary probe) పేర్కొంది. దీనివల్ల కోరమండల్ రైలులో 19 బోగీలు పట్టాలు తప్పాయి. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలుతో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, 300కు చేరవచ్చని తెలుస్తోంది.

Updated Date - 2023-06-03T16:44:16+05:30 IST