Varanasi: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2023-01-13T11:40:16+05:30 IST

ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ అయిన ఎంవీ గంగా విలాస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు...

Varanasi: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్‌ ప్రారంభం
Modi launch river cruise

వరణాసి(ఉత్తరప్రదేశ్): ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ అయిన ఎంవీ గంగా విలాస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు.(Prime Minister Narendra Modi flags off) అనంతరం వారణాసిలో(Varanasi) టెంట్ సిటీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రారంభించారు.గంగావిలాస్(Ganga Vilas) ప్రారంభం పర్యాటక రంగంలో కొత్త యుగానికి నాంది పలుకుతుందని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, ఇతర మంత్రులు,వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గంగా నదిపై ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ సర్వీస్ ప్రారంభం కావడం ఒక మైలురాయి అని ప్రధాని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ భారతదేశంలో పర్యాటక రంగానికి కొత్త యుగానికి నాంది పలుకుతుందని మోదీ నొక్కి చెప్పారు.ఎంవీ గంగా విలాస్‌లో ప్రయాణిస్తున్న పర్యాటకుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తుందని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు.

బక్సర్, ఛప్రా, పాట్నా, ముంగేర్, సుల్తాన్‌గంజ్,కహల్‌గావ్ మీదుగా వెళ్లే క్రూయిజ్‌లో పర్యాటకులకు ప్రతి ఓడరేవు వద్ద సంప్రదాయ స్వాగతం పలికి చారిత్రక ప్రదేశాలను సందర్శించేందుకు తీసుకువెళతామని తేజస్వీ యాదవ్ చెప్పారు.

Updated Date - 2023-01-13T11:40:18+05:30 IST