Vande Bharat Express: రాజస్థాన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు మోదీ పచ్చజెండా
ABN , First Publish Date - 2023-04-12T11:09:38+05:30 IST
రాజస్థాన్ రాష్ట్రంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను బుధవారం ఉదయం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి...
న్యూఢిల్లీ: రాజస్థాన్ రాష్ట్రంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను బుధవారం ఉదయం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.(Vande Bharat Express) అజ్మీర్-ఢిల్లీ కంటోన్మెంట్ (Rajasthan)వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును బుధవారం ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్లాగ్ ఆఫ్ చేశారు. అజ్మీర్-ఢిల్లీ కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హై-రైజ్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ టెరిటరీలో ప్రపంచంలోనే మొదటి సెమీ-హై స్పీడ్ ప్యాసింజర్ రైలు కానుంది.వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అజ్మీర్-ఢిల్లీ కంటోన్మెంట్ మార్గంలో నడుస్తుంది.ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న అత్యంత వేగవంతమైన రైలు కంటే ఒక గంట ముందుగానే ఈ రైలు ప్రయాణం పూర్తి అవుతుందని రైల్వే అధికారులు చెప్పారు.
ఇది కూడా చదవండి : Bathinda: మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు...నలుగురి మృతి
ప్రారంభ పరుగు జైపూర్- ఢిల్లీ కంటోన్మెంట్ మధ్య ఉంటుంది.ఈ రైలు అజ్మీర్, ఢిల్లీ కంటోన్మెంట్, జైపూర్, అల్వార్ ,గురుగ్రామ్‌లలో ఆగుతుందని అధికారులు పేర్కొన్నారు.ఈ రైలు ఢిల్లీ కంటోన్మెంట్ - అజ్మీర్ మధ్య దూరాన్ని 5 గంటల 15 నిమిషాల్లో చేరుకుంటుంది.ఈ రైలు పుష్కర్, అజ్మీర్ దర్గాలతో సహా రాజస్థాన్‌లోని ప్రధాన పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని అధికారులు చెప్పారు.