Bharat Mandap: ఐటీపీఓ కాంప్లెక్స్‌ను డ్రోన్ ద్వారా ప్రారంభించిన మోదీ

ABN , First Publish Date - 2023-07-26T20:14:45+05:30 IST

భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కొత్తగా అభివృద్ధి చేసిన న్యూ ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ కాంప్లెక్స్ 'భారత్ మండటం' ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారంనాడు ఒక డ్రోన్ ద్వారా ప్రారంభించారు.

Bharat Mandap: ఐటీపీఓ కాంప్లెక్స్‌ను డ్రోన్ ద్వారా ప్రారంభించిన మోదీ

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కొత్తగా అభివృద్ధి చేసిన న్యూ ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) కాంప్లెక్స్ 'భారత్ మండటం' (Bharat Mandapam)ను ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారంనాడు ఒక డ్రోన్ ద్వారా ప్రారంభించారు. దేశ రాజధానిలోని ప్రగతి మైదాన్‌ వద్ద పునరావృద్ధి చేసిన ఐటీపీఓ కాంప్లెక్స్‌‌కు తొలుత పూజా కార్యక్రమాలు, హోమం నిర్వహించగా, ప్రధాని అందులో పాల్గొన్నారు. కాంప్లెక్స్ నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులతో ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు. వారిని సన్మానించి, కలిసి ఫోటోలు దిగారు. అంతర్జాతీయ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్‌‌ను అత్యద్భుతంగా తీర్దిదిద్దిన శ్రామికులను గౌరవించుకోవడం సంతోషంగా ఉందంటూ ప్రధాని ఒక ట్వీట్‌లో తెలిపారు.


కాగా, ప్రగతి మైదాన్‌లో 123 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాలం చెల్లిన ఐటీపీఓ కాంప్లెక్స్‌ను జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం రీడలప్ చేసింది. భారతదేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్‌గా తీర్దిదిద్దింది. మీటింగ్‌లు, ప్రోత్సాహకాలు, సమావేశాలు, ప్రదర్శనలు గమ్యస్థానంగా ఉండేలా రూ.2,700 కోట్లతో దీనిని రీడలప్ చేసినట్టు పీఎంఓ తెలిపింది. ఇందులో కన్వెన్షన్లు సెంటర్, ఎగ్జిబిషన్ హాల్స్, యాంఫిథియేటర్లు తదితర అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కీలక సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చేవిధంగా ''భారత్ మండపం'' నిర్మాణం జరపాలనే మోడీ ఆకాంక్షలకు అనుగుణంగా దీనిని నిర్మించినట్టు పీఎంఓ పేర్కొంది. ఐటీపీఓ కాంప్లెక్స్ ''భారత్ మండపం'' ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, రాజ్‌నాథ్ సింగ్, డాక్టర్ జితేంద్ర సింగ్, నటుడు అమీర్‌ఖాన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-26T20:16:11+05:30 IST