Share News

PM Modi: ఆ ఘటనను మర్చిపోలేను.. ముంబయి ఉగ్రదాడులపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-11-26T13:40:10+05:30 IST

ముంబయిపై దశాబ్దం కిందట జరిగిన ఉగ్రదాడిని తాను మర్చిపోలేదని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ మన్ కీ బాత్ లో నవంబర్ 26, 2008 ముంబయిలో జరిగిన ఉగ్రదాడి(Mumbai Terror Attack) ఘటనని ఆయన గుర్తు చేసుకున్నారు.

PM Modi: ఆ ఘటనను మర్చిపోలేను.. ముంబయి ఉగ్రదాడులపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ: ముంబయిపై దశాబ్దం కిందట జరిగిన ఉగ్రదాడిని తాను మర్చిపోలేదని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ మన్ కీ బాత్ లో నవంబర్ 26, 2008 ముంబయిలో జరిగిన ఉగ్రదాడి(Mumbai Terror Attack) ఘటనని ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం మోదీ(PM Modi) మాట్లాడుతూ... "ముంబయి ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య. ఉగ్రవాదులు అప్పట్లో దేశాన్ని వణికించారు. ప్రస్తుతం భారత్ వారిని అణచివేయడానికి అన్ని కఠిన చర్యలు చేపట్టింది. టెర్రరిజాన్ని(Terrorism) ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు. ముంబయి దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను" అని అన్నారు.

ఆ రోజు 10 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు విధ్వంసకర ఆయుధాలతో ముంబయిలో వరుస దాడులు చేశారు. ఈ దాడులు పౌరులు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నాయి. అరేబియా సముద్రం మీదుగా నగరంలోకి చొరబడిన ఉగ్రవాదులు 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మందిని హతమార్చగా, వందలాది మంది గాయపడ్డారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. ఛత్రపతి శివాజీ టర్మినస్ రైల్వే స్టేషన్, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, నారిమన్ హౌస్ జ్యూయిష్ కమ్యూనిటీ సెంటర్‌తో సహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో AK-47 రైఫిల్స్, గ్రనైడ్‌లతో ఉగ్రదాడులు జరిగాయి.

ఈ దాడుల్లో మరణించిన వారిలో అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబయి అదనపు పోలీసు కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్ ఉన్నారు. దాడులు చేసిన పది మంది ఉగ్రవాదుల్లో తొమ్మిది మందిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మనుగడలో ఉన్న ఒక ఉగ్రవాది, అజ్మల్ కసబ్‌ను అరెస్టు చేసి నవంబర్ 21, 2012న ఉరితీశారు.


నివాళి అర్పించిన ద్రౌపది ముర్ము..

ముంబయి ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Drowpadi Murmu) నివాళి అర్పించారు. దేశ ప్రజలంతా ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.

"ముంబయి ఉగ్రదాడి మర్చిపోలేనిది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన భద్రతా సిబ్బందికి నివాళి అర్పిస్తున్నాను. ఉగ్రవాదాన్ని సమష్టిగా ఎదుర్కోవాలి" అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Updated Date - 2023-11-26T13:43:15+05:30 IST