Prajwal Revanna: దేవెగౌడ మనవడికి షాకిచ్చిన కర్ణాటక హైకోర్టు
ABN , First Publish Date - 2023-09-01T20:37:05+05:30 IST
మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ సెక్యులర్ వ్యవస్థాపకుడు హెచ్‌డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన లోక్‌సభ ఎన్నికపై అనర్హత వేటు వేసింది. ఎన్నికల సమాచారంలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చినందుకు ఆయనపై అనర్హత వేటు వేస్తూ జస్టిస్ కె.నటరాజన్ పార్ట్లీ శుక్రవారం తీర్పు చెప్పారు.
బెంగళూరు: మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) వ్యవస్థాపకుడు హెచ్‌డీ దేవెగౌడ (HD Deve gowda) మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)కు కర్ణాటక హైకోర్టు (Karnataka High court) షాక్ ఇచ్చింది. ఆయన లోక్‌సభ ఎన్నికపై అనర్హత వేటు వేసింది. ఎన్నికల సమాచారంలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చినందుకు ఆయనపై అనర్హత వేటు వేస్తూ జస్టిస్ కె.నటరాజన్ పార్ట్లీ శుక్రవారం తీర్పు చెప్పారు.
కర్ణాటకలోని హనస్ నియోజకవర్గానికి రేవణ్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో జేడీఎస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఏకైక నేత కూడా ఆయనే కావడం విశేషం. హసన్ నియోజకవర్గం ఓటరు జి.దేవరాజే గౌడ, అప్పట్లో రేవణ్ణ చేతిలో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఎ.మంజు కోర్టుకు వెళ్లారు. నామినేషన్ పత్రాలు సర్పించేటప్పుడు తన ఆస్తి వివరాలు ఆయన దాటిపెట్టి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి, కోర్టుకు నివేదిక సమర్పించింది. కాగా, హైకోర్టు తాజా తీర్పుతో ఆరేళ్ల పాటు రేవణ్ణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతారు. అయితే, హైకోర్టు తీర్పును రేవణ్ణ లీగల్ టీమ్ సుప్రీంకోర్టులో సవాలు చేసే వీలుంది.