President of TNCC: మాది ప్రజాస్వామ్య కూటమి
ABN , First Publish Date - 2023-02-14T07:50:31+05:30 IST
డీఎంకే నేతృత్వంలో ఏర్పాటైన కూటమి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తోందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు
- టీఎన్‌సీసీ అధ్యక్షుడు అళగిరి
ప్యారీస్(చెన్నై), ఫిబ్రవరి 13: డీఎంకే నేతృత్వంలో ఏర్పాటైన కూటమి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తోందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు కేఎస్ అళగిరి(KS Alagiri) పేర్కొన్నారు. రాయపేటలోని టీఎన్‌సీసీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీచేస్తున్న కాంగ్రెస్(Congress) అభ్యర్థి ఈవీకేఎస్ ఇళంగోవన్ విజయం ఇప్పటికే ఖరారైందని, ప్రతిపక్షాలు కుయుక్తులు ఫలించవన్నారు. ఈ నెల 14,15,16 తేదీల్లో తాను, 15న కాంగ్రెస్ అధికార ప్రతినిధి దినేష్ గుండూరావు ఈరోడ్‌లో ఇళంగోవన్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటామని తెలిపారు. సమావేశంలో టీఎన్‌సీసీ ప్రధాన కార్యదర్శి కె.చిరంజీవి, సీనియర్ నేతలు గోపన్న, ఎస్‌ఏ వాసు తదితరులు పాల్గొన్నారు.