Cauvery Water disputes: నిరసనలకు ఓకే.. షరతులు వర్తిస్తాయి: సిద్ధరామయ్య

ABN , First Publish Date - 2023-09-25T17:42:28+05:30 IST

తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై రాష్ట్రంలో నిరసనలు తీవ్రమవుతుండటంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. నిరసనలను తమ ప్రభుత్వం అడ్డుకోదని, అయితే శాంతి భద్రతలను, ప్రశాంతను పాటించాలని కోరారు. కావేరీ జాలల వివాదంపై తదుపరి విచారణ సుప్రీంకోర్టు మందుకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపిస్తుందని చెప్పారు.

Cauvery Water disputes: నిరసనలకు ఓకే.. షరతులు వర్తిస్తాయి: సిద్ధరామయ్య

బెంగళూరు: తమిళనాడుకు కావేరి జలాల (Cauvery Water) విడుదలపై రాష్ట్రంలో నిరసనలు తీవ్రమవుతుండటంపై కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaih) స్పందించారు. నిరసనలను తమ ప్రభుత్వం అడ్డుకోదని, అయితే శాంతి భద్రతలను, ప్రశాంతను పాటించాలని కోరారు. కావేరీ జాలల వివాదంపై తదుపరి విచారణ సుప్రీంకోర్టు మందుకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.


కావేరీ అంశంపై నిరసనలు, బంద్‌లకు పిలుపు ఇస్తుండటంపై మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో నిరసనలను ప్రభుత్వాలు అడ్డుకోరాదని అన్నారు. ఈ అంశంపై బీజేపీ, జేడీఎస్ రాజకీయాలు చేస్తున్నాయని తప్పుపట్టారు. తమిళనాడుకు 5,000 క్యూసెక్కుల జలాలను విడుదల చేయాలంటూ కావేరీ వాటర్ మేనేజిమెంట్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వుపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ఇటీవల నిరాకరించింది. వర్షాకాలంలో సరైన వర్షాలు పడక నీటి కొరత ఏర్పడిందని, ఆ కారణంగానే నీటిని విడుదల చేయలేకపోతున్నామని కర్ణాటక తన వాదన వినిపించింది.


''కావేరి వాటర్ మేనేజిమెంట్ అథారిటీ అండ్ రెగ్యులేషన్ కమిటీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. ఇరు రాష్ట్రాల మధ్య భాగాల పరిష్కరానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తమిళనాడు తొలుత 24,000 క్యూసెక్కులు, ఆ తర్వాత 7,200 క్యూసెక్కులు అడిగింది. జలాలు లేనందున 5,000 క్యూసెక్కులు కూడా ఇవ్వలేమని వారికి చెప్పాం'' అని సిద్ధరామయ్య తెలిపారు. సెప్టెంబర్ 26న మళ్లీ కోర్టు ముందు విచారణ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు కోర్టు ముందు ఉంచుతామని అన్నారు.


నిరసనలు ప్రజాస్వామిక హక్కు: డీకే

ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ, నిరసనలు అనేవి ప్రజాస్వామిక హక్కు అని, అయితే ప్రజాజీవితానికి కష్టాలు కలిగించేలా నిరసలు ఉండరాదన్నారు. నిరసనలు, బంద్ పిలుపులు ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, కోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవాలని, లేకుంటే చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. బంద్ విషయంలో వివిధ సంస్థల మధ్య సమన్వయం ఉండాలన్నారు. బంద్ విజయవంతం కావాలంటే ప్రజల సహకారం తప్పనసరి అని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని తెలిపారు.

Updated Date - 2023-09-25T17:56:07+05:30 IST