Rahul Gandhi: గిరిజన డాక్యుమెంట్ల డిజిటలైజేషన్‌లో వయనాడ్ సరికొత్త రికార్డు
ABN , First Publish Date - 2023-01-21T18:25:12+05:30 IST
గిరిజనుల సమాచారంతో కూడిన డాక్యుమెంట్ల డిజిటలైజేషన్‌లో కేరళలోని వయనాడ్ జిల్లా సరికొత్త రికార్డు..
వయనాడ్: గిరిజనుల సమాచారంతో కూడిన డాక్యుమెంట్ల డిజిటలైజేషన్‌లో కేరళలోని వయనాడ్ (Wayanad) జిల్లా సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే గిరిజనులకు సంబంధించి ఈ తరహా ప్రక్రియ పూర్తి చేసిన తొలి జిల్లాగా నిలిచింది. వయనాడ్ ఎంపీ రాహుల్ రాంధీ (Rahul Gandhi) ఓ ట్వీట్‌లో ఈ విషయాన్ని తెలియజేస్తూ, జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. గిరిజన వర్గాలకు సాధికారత అనేది పటిష్ట భారతావనికి మూలస్తంభం అని రాహుల్ ట్వీట్ చేసారు. గిరిజనులందరికి చెందిన ప్రాథమిక పత్రాలను డిజిటలైజేషన్ చేసి, దేశంలోనే తొలి జిల్లాగా నిలిచిన వయనాడ్‌ను చూసి గర్విస్తున్నానని అన్నారు. ఇందుకోసం సమష్టిగా కృషి చేసిన జిల్లా యంత్రాగం, స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధుల చొరవను ఆయన శ్లాఘించారు.
వయనాడ్‌లో గిరిజనులు..
కేరళలోని వయనాడ్‌లో గిరిజనుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. అడియన్, పనియన్, ముల్లుక్కూర్మన్, కురిచ్‌ఆన్, వెట్టాక్కురుమాన్, వయనాడ్ కదర్, కట్టునియక్కన్, తచందన్ మూపన్ సహా 8 షెడ్యూల్ట్ తెగల వారు ఉన్నారు.