Rahul Gandhi: బసవణ్ణ ప్రజాస్వామ్యం ప్రపంచానికి మార్గదర్శకం: రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2023-04-23T21:48:58+05:30 IST

బసవణ్ణ (Basaveshwara) అవలంబించిన ప్రజాస్వామ్యం, సమానత్వం ప్రపంచానికి మార్గదర్శకమని

Rahul Gandhi: బసవణ్ణ ప్రజాస్వామ్యం ప్రపంచానికి మార్గదర్శకం: రాహుల్ గాంధీ

బెంగళూరు: బసవణ్ణ (Basaveshwara) అవలంబించిన ప్రజాస్వామ్యం, సమానత్వం ప్రపంచానికి మార్గదర్శకమని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) కొనియాడారు. కర్ణాటకలోని బాగల్కోటె జిల్లాలో ఉన్న త్రివేణి సంగమాన్ని రాహుల్‌గాంధీ ఆదివారం సందర్శించారు. సంగమనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బసవణ్ణ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ 12వ శతాబ్దంలోనే సమానత్వం ఆకాంక్షించిన మహనీయుడు బసవణ్ణ అని కొనియాడారు.

బసవణ్ణ ఆశయాలు నేటికీ పాటిస్తున్నామని పేర్కొన్నారు. కుల వ్యవస్థలో మార్పునకు బసవణ్ణ జీవితకాలం పనిచేశారని తెలిపారు. బసవణ్ణ ఎనిమిదేళ్ల బాలుడిగా ఉన్నప్పుడే సమసమాజాన్ని ఆశించారన్నారు. సమాజంలో ఎక్కువమందికి వాస్తవాలు తెలుసని, చెప్పేందుకు భయపడతారని, కానీ బసవణ్ణ అలా వ్యవహరించలేదని తెలిపారు. బసవణ్ణ జీవిత చరిత్ర, ధర్మపీఠం గురించి రాహుల్‌గాంధీకి గదగ్‌ తోంటెదార్య స్వామిజీ వివరించారు. ప్రతిపక్షనేత సిద్దరామయ్య, మాజీ మంత్రి ఎంబీ పాటిల్‌, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర్‌ దంపతులు రాహుల్‌కు బసవణ్ణ విగ్రహాన్ని బహూకరించారు.

Updated Date - 2023-04-23T21:48:58+05:30 IST