Rahul Gandhi: కార్పెంటర్‌లా మారి.. కష్టాలు తెలుసుకున్న రాహుల్ గాంధీ
ABN , First Publish Date - 2023-09-28T18:53:23+05:30 IST
భారత్ జోడో యాత్ర(Barath Jodo) తరువాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పూర్తిగా పబ్లిక్ తో మమేకం కావడానికి ప్రయత్నిస్తున్నారు. జోడో యాత్ర తరువాత దేశంలోని పలు రంగాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగా లారీ డ్రైవర్లు, చేతి వృత్తుల వారు, రైతులు తదితరులను ఇప్పటికే కలిశారు. ఆయన తాజాగా ఢిల్లీ(Delhi)లో కార్పెంటర్లను కలుసుకున్నారు.
ఢిల్లీ: భారత్ జోడో యాత్ర(Barath Jodo) తరువాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పూర్తిగా పబ్లిక్ తో మమేకం కావడానికి ప్రయత్నిస్తున్నారు. జోడో యాత్ర తరువాత దేశంలోని పలు రంగాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగా లారీ డ్రైవర్లు, చేతి వృత్తుల వారు, రైతులు తదితరులను ఇప్పటికే కలిశారు. ఆయన తాజాగా ఢిల్లీ(Delhi)లో కార్పెంటర్లను కలుసుకున్నారు. కీర్తి నగర్ ఫర్నిచర్ మార్కెట్ లో ఇవాళ ఆయన పర్యటించారు. అక్కడ ఓ షాపులోకి వెళ్లి కార్పెంటర్ల సాధకబాధకాలు తెలుసుకున్నారు. వడ్రంగుల సమస్యలు విన్నారు.
అదే సమయంలో తానూ ఫర్నిచర్ డిజైన్ చేస్తాను అనడంతో షాక్ అయిన కార్మికులు.. ఆయనకు ఫర్నిచర్ చేసే విధానాన్ని నేర్పించారు. రాహుల్ స్వయంగా తన చేత్తో వడ్రంగి పనులు చేశారు. ఈ సడెన్ విజిట్ గురించి రాహుల్ తన ఎక్స్(X) అకౌంట్ లో ఇలా రాసుకొచ్చారు... "ఈ రోజు నేను ఢిల్లీలోని కీర్తి నగర్‌లో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద ఫర్నిచర్ మార్కెట్‌కి వెళ్లి కార్పెంటర్(Carpenter) సోదరులను కలిశాను. వారు కష్టపడి పనిచేసేవారే కాదు.. అద్భుతమైన కళాకారులు. మన్నికతో కూడిన అందాన్ని చెక్కడంలో నిపుణులు" అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని కాంగ్రెస్(Congress) అధికారిక ఎక్స్ అకౌంట్ లో షేర్ చేశారు. భారత్ జోడో యాత్ర ఇంకా కొనసాగుతోందనే టైటిల్ ఇచ్చారు.