Train Accident: అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం
ABN , First Publish Date - 2023-06-03T21:59:28+05:30 IST
ప్రమాద సమయంలో ట్రాక్‌లపై రైళ్ల పొజిషన్‌పై రైల్వే అధికారులు రేఖా చిత్రాన్ని విడుదల చేశారు. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఒడిషా ప్రభుత్వం తెలిపింది.
న్యూఢిల్లీ: శుక్రవారం సాయంత్రం ఒడిశా(Odisha)లోని బాలాసోర్( Balasore)లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 288కు చేరింది. దాదాపు 900 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు సమీపంలో ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇదిలా వుంటే ప్రమాద సమయంలో ట్రాక్‌లపై రైళ్ల పొజిషన్‌పై రైల్వే అధికారులు రేఖా చిత్రాన్ని విడుదల చేశారు. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని రైల్వే వర్గాలు వెల్లడించాయి.
రైల్వే అధికారులు విడుదల చేసిన రేఖాచిత్రంలో ప్రమాదం జరిగిన తీరును వివరించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మొత్తం మూడు ట్రాక్‌లుండగా..శాలిమర్- చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్(Shalimar-Chennai Central Coromandel Express) వస్తున్న ట్రాక్ మధ్యలో ఉంది. ఈ ట్రాక్2ను UP line అని పిలుస్తారు. DN main గా పిలువబడే మరో ట్రాక్ ద్వారా బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(Bengaluru-Howrah Superfast Express) క్రాస్ అయిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన కొన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న గూడ్స్ రైలు(Goods Train)ను ఢీకొన్నాయి. మరికొన్ని కోచ్‌లు DN main లైన్‌పై పడ్డాయి. బెంగళూరు-హౌరా రైలు పట్టాలు తప్పి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లను ఢీకొట్టిందని అధికారులు తెలిపారు.
అయితే కొంతమంది రైల్వే నిపుణులు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ నేరుగా లూప్ లైన్(loop line) లోపల గూడ్స్ రైలును ఢీకొట్టి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విజువల్స్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్ గూడ్స్ రైలు పైభాగంలో ఉన్నట్లు కనిపిస్తుంది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ నేరుగా గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు తెలియజేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లూప్ లైన్ అనేది ప్రధాన రైల్వే ట్రాక్‌ల నుంచి విడిపోయి ఉండి కొంత దూరం తర్వాత మెయిన్‌లైన్‌కి తిరిగి కలుస్తుంది. ఇది రద్దీగా ఉండే రైలు ట్రాఫిక్‌ని నిర్వహించడానికి సహాయపడుతుంది.
కాగా ఈ ఘోర రైలు ప్రమాదానికి గాల కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో రైల్వే అధికారులు ఉన్నారు. టెక్నికల్ లోపం వల్ల ప్రమాదం జరిగిందా లేక మానవ తప్పిదం వల్ల జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.