Share News

Rajastan Elections: పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన ఓటర్లు.. ఉదయం 9 గంటల వరకు 9.77 శాతం ఓటింగ్

ABN , First Publish Date - 2023-11-25T10:47:18+05:30 IST

రాజస్థాన్(Rajastan)లో ఓట్లు వేయడానికి ప్రజలు క్యూలు కట్టారు. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. 9 గంటల వరకు నమోదైన ఓట్ల శాతాన్ని అధికారులు వెల్లడించారు. ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9.77 శాతం పోలింగ్ నమోదైనట్లు వివరించారు.

Rajastan Elections: పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన ఓటర్లు.. ఉదయం 9 గంటల వరకు 9.77 శాతం ఓటింగ్

జైపుర్: రాజస్థాన్(Rajastan)లో ఓట్లు వేయడానికి ప్రజలు క్యూలు కట్టారు. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. 9 గంటల వరకు నమోదైన ఓట్ల శాతాన్ని అధికారులు వెల్లడించారు. ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9.77 శాతం పోలింగ్ నమోదైనట్లు వివరించారు. ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 200 నియోజకవర్గాలకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్(Polling) జరుగుతోంది.

డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 5,25,38,105 మంది ఓటర్లు ఉండగా 1,862 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి, శాంతి ధరివాల్, బిడి కల్లా, భన్వర్ సింగ్ భాటి, సలేహ్ మహ్మద్, మమతా భూపేష్, ప్రతాప్ సింగ్ ఖచరియావాస్, రాజేంద్ర సహా పలువురు మంత్రులు ఎన్నికల బరిలో ఉన్నారు. యాదవ్, శకుంత్లా రావత్, ఉదయ్ లాల్ అంజనా, మహేంద్రజీత్ సింగ్ మాల్వియా, అశోక్ చందనా, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ లు కూడా బరిలో నిలిచారు.


బీజేపీ(BJP)లో ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్, సతీష్ పూనియా, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఎంపీలు దియా కుమారి, రాజ్యవర్ధన్ రాథోడ్, బాబా బాల్కనాథ్, కిరోడి లాల్ మీనా పోటీలో ఉన్నారు.రాజస్థాన్‌లో ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ మధ్య ఉంది. రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలకు గాను 199 సీట్లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

శ్రీగంగానగర్‌ జిల్లా కరణ్‌పూర్‌ స్థానంలో కాంగ్రెస్‌(Congress) అభ్యర్థి, సిటింగ్‌ ఎమ్మెల్యే గుర్మీత్‌సింగ్‌ కునర్‌ ఆకస్మిక మరణంతో అక్కడి ఎన్నికను వాయిదా వేశారు. కాగా 199 స్థానాలకు 1,862 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం ఓటర్లు 5,25,38,105 మంది కాగా.. వీరిలో మూడో వంతు మంది (1,70,99,334) 18-30 ఏళ్ల వయసు వారే కావడం గమనార్హం.

వీరిలోనూ 22,61,008 మంది (18-19 ఏళ్లవారు) తొలి సారి ఓటు వేస్తున్నవారు ఉన్నారు. ఓటర్లలో పురుషుల సంఖ్య 2.73 కోట్లుగా మహిళా ఓటర్ల సంఖ్య 2.52 కోట్లుగా ఉంది. కాగా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. 73 స్థానాల్లో గెలిచిన బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. స్వతంత్రులు-13, బీఎస్పీ-6, ఆర్‌ఎల్‌పీ-3, సీపీఎం-2, బీటీపీ-2, ఆర్‌ఎల్‌డీ ఒక స్థానంలో విజయం సాధించాయి.

Updated Date - 2023-11-25T10:47:19+05:30 IST