Rajinikanth: అరుణాచలేశ్వరుడి సన్నిధిలో రజనీకాంత్‌

ABN , First Publish Date - 2023-07-02T08:00:06+05:30 IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) అరుణాచలేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ఆయన శనివారం ఆలయానికి వచ్చి స్వామివా

Rajinikanth: అరుణాచలేశ్వరుడి సన్నిధిలో రజనీకాంత్‌

అడయార్‌(చెన్నై): సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) అరుణాచలేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ఆయన శనివారం ఆలయానికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం తన పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో ‘లాల్‌సలాం’ అనే చిత్రం షూటింగ్‌ తిరువణ్ణామలైలో జరుగుతోంది. ఇందులో రజినీకాంత్‌ గెస్ట్‌ రోల్‌ చేస్తున్నారు. తన పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం తిరువణ్ణామలైలో గత నెల 25వ తేదీ నుంచి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆయన అరుణాచలేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు అమ్మాణి అమ్మన్‌ ప్రవేశద్వారంలో ఆలయంలోకి ప్రవేశించిన రజనీకాంత్‌కు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఆ తర్వాత అరుణాచలేశ్వర స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ శివాచార్యులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన ఆలయంలోనే ఉన్నారు. ఇదిలావుండగా, రజనీకాంత్‌ వచ్చారన్న వార్త తెలియగానే ఆయన అభిమానులతో పాటు స్థానికులు కూడా భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చారు. రజనీతో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. అయితే, ఆలయ అధికారులతో పాటు స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు కల్పించి ఎలాంటి తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకున్నారు. స్వామిదర్శనం తర్వాత రజనీకాంత్‌ తన కారులో షూటింగ్‌ స్పాట్‌కు వెళ్ళిపోయారు. కాగా, గత 25 యేళ్ళ క్రితం రజనీకాంత్‌ తిరువాణ్ణామలైలో గిరివలయ ప్రదక్షిణం చేసిన విషయం తెల్సిందే. ఇపుడు అంటే కొన్నేళ్ళ తర్వాత ఆయన అరుణాచల స్వామి దర్శనం కోసం రావడం గమనార్హం.

nani2.jpg

Updated Date - 2023-07-02T08:00:06+05:30 IST