Rajnath Singh: రాహుల్యాన్‌ను లాంచ్ గానీ, ల్యాండ్ గానీ చేయలేం.. రాజ్‌నాథ్ సింగ్ సెటైర్లు

ABN , First Publish Date - 2023-09-04T19:10:30+05:30 IST

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, డీఎంకే లీడర్, నటుడు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మ డెంగ్యూ, మలేరియా లాంటిదని..

Rajnath Singh: రాహుల్యాన్‌ను లాంచ్ గానీ, ల్యాండ్ గానీ చేయలేం.. రాజ్‌నాథ్ సింగ్ సెటైర్లు

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, డీఎంకే లీడర్, నటుడు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మ డెంగ్యూ, మలేరియా లాంటిదని.. దీన్ని నిర్మూలించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా.. బీజేపీకి చెందిన నాయకులు తారాస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.


రాజస్థాన్‌లో బీజేపీ పరివర్తన్ యాత్ర మూడో రౌండ్ ప్రారంభం సందర్భంగా జైసల్మేర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయ్యిందని, అయితే ‘‘రాహుల్‌యాన్’’ని మాత్రం లాంచ్ గానీ, ల్యాండ్ గానీ చేయలేరని దుయ్యబట్టారు. అసలు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఎందుకు మౌనంగా ఉన్నారు? సనాతన ధర్మంపై సోనియా, రాహుల్, ఖర్గేల ఆలోచన ఏమిటి? అని నిలదీశారు. డీఎంకే పార్టీ సనాతన ధర్మాన్ని అవమానించిందని.. దీనిపై కాంగ్రెస్ లీడర్లు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని అవమానించేలా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఇండియా కూటమి సభ్యులు క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే ఈ దేశం వారిని క్షమించదని హెచ్చరించారు.

సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ వివరణ ఇవ్వాలని రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. ఈ ప్రపంచాన్ని సనాతన ధర్మం ఒక కుటుంబంలా భావిస్తుందని.. వసుధైక కుటుంబం (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే సందేశాన్ని ఇస్తుందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో ఎన్నికలు వస్తున్న తరుణంలో.. హిందూ-ముస్లిం అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి, ఓట్లు పొందాలని కాంగ్రెస్ భావిస్తోందని అభిప్రాయపడ్డారు. అశోక్ గెహ్లాట్ డ్రైవర్ సీటులో కూర్చున్నారు కానీ.. క్లచ్, యాక్సిలరేటర్‌లను మరెవ్వరో నొక్కుతున్నారని ఎద్దేవా చేశా

Updated Date - 2023-09-04T19:28:34+05:30 IST