Share News

Rajnath Singh: చైనా సరిహద్దుల్లోని తవాంగ్‌లో పర్యటించిన రాజ్‌నాథ్... బీఎస్ఎఫ్ జవాన్ల మధ్య దసరా వేడుక

ABN , First Publish Date - 2023-10-24T17:50:38+05:30 IST

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారంనాడు భారత్-చైనా సరహద్దుల్లోని తవాంగ్ జిల్లా బమ్ లా పాస్‌ ప్రాంతాన్ని సందర్శించారు. బమ్ లా పాస్ ఆవలివైపున ఉన్న చైనా పీఎల్ఏ పోస్టులను పరిశీలించారు. సరిహద్దు భద్రతా జవాన్లను కలుసుకుని వారితో దసరా వేడుకల్లో పాలుపంచుకున్నారు.

Rajnath Singh: చైనా సరిహద్దుల్లోని తవాంగ్‌లో పర్యటించిన రాజ్‌నాథ్... బీఎస్ఎఫ్ జవాన్ల మధ్య దసరా వేడుక

తవాంగ్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారంనాడు భారత్-చైనా సరిహద్దుల్లోని తవాంగ్ (Tawang) జిల్లా బమ్ లా పాస్‌ (Bum la) ప్రాంతాన్ని సందర్శించారు. బమ్ లా పాస్ ఆవలివైపున ఉన్న చైనా పీఎల్ఏ (PLA) పోస్టులను పరిశీలించారు. సరిహద్దు భద్రతా జవాన్లను కలుసుకుని వారితో దసరా వేడుకల్లో పాలుపంచుకున్నారు.


రెండు రోజుల పర్యటనలో భాగంగా అసోం, అరుణాచల్‌లో రాజ్‌నాథ్ సోమవారం తన పర్యటనను ప్రారంభించారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే ఆయన వెంట ఉన్నారు. బుమ్ లా పాస్‌‌ను భారత-చైనా సరిహద్దు విషయంలో అత్యంత సున్నితమైన సమస్యాత్మక ప్రాంతంగా భావిస్తుంటారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాను, చైనాలోని సోనా కంట్రీని అనుసంధానించే మార్గం ఇది. ఎల్ఏసీకి అత్యంత సమీపాన ఈ ప్రాతం ఉందని, చైనా-భారత్ మధ్య కొన్ని ప్రిక్షన్ పాయింట్ల విషయంలో ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో రాజ్‌నాథ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.


బమ్‌లా పాస్‌లో నిరంతర పహారా ఉన్న భద్రతా జవాన్లను రాజ్‌నాథ్ కలుసుకుని వారిని ఉత్సాహపరిచారు. వారి ధైర్యసాహసాలను ప్రశంసించారు. తవాంగ్ వార్ మెమోరియల్‌ను సందర్శించిన 1962-చైనా యుద్ధంలో అమరుడైన సుబేదార్ జోగిందర్ సింగ్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆయుధ పూజలో పాల్గొన్నారు. జవాన్ల ఉద్దేశించి మాట్లాడుతూ, మరోసారి జవాన్లతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, దేశాన్ని కాపాడే బాధ్యతను తమ భుజస్కంథాలపై వేసుకున్న జవాన్లే నిజమైన హీరోలని ప్రశంసించారు. నాలుగేళ్ల క్రితం కూడా ఇక్కడకు వచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. వీరజవాన్లను చూసి దేశం గర్విస్తోందన్నారు. దేశ సరిహద్దులను జవాన్లు సురక్షితంగా ఉంచడం వల్ల భారతదేశ ప్రతిష్ఠ శీఘ్రగతిన పెరుగుతోందని, అభివృద్ధి చెందిన దేశాలన్నీ గత 8-9 ఏళ్లుగా ఈ వాస్తవాన్ని అంగీకరిస్తున్నాయన చెప్పారు.

Updated Date - 2023-10-24T17:50:38+05:30 IST