Home » Arunachal Pradesh
మంచు ప్రదేశాల్లో నదులు, సరస్సులు గడ్డ కట్టుకుపోవడం చూస్తుంటాం. ఆ దృశ్యాలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. అలాగే గడ్డకట్టిన నీటిపై నడవడం కూడా వింత అనుభూతిని కలిగిస్తుంది. దీంతో చాలా మంది ఇలాంటి ప్రదేశాలను చూడటానికి వెళ్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. ఈ తరహా..
నైతిక విలువలు మరిచిన గురువులకు న్యాయస్థానం కఠిన శిక్షలు విధించింది. 21 మంది పిల్లలపై అత్యాచారం చేసిన హాస్టల్ వార్డెన్ యుమ్కెన్ బగ్రాకు మరణశిక్ష విధిస్తూ అరుణాచల్ ప్రదేశ్‌లోని యుపియాకు చెందిన ప్రత్యేక పోక్సో కోర్టు గురువారం తీర్పు చెప్పింది.
భారీ వర్షాలతో దేశ రాజధాని న్యూఢిల్లీ అతలాకుతలమవుతుంది. అయితే ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం శుక్రవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.
బీజేపీ నేత పెమా ఖండూ అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ లెజిస్లే చర్ పార్టీ నేతగా బుధవారంనాడు తిరిగి ఎన్నికయ్యారు. దీంతో మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
అరుణాచల్ ప్రదేశ్‌లో కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ ఇక్కడ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మరోవైపు సిక్కింలో.. సిక్కిం క్రాంతి మోర్చా(ఎ్‌సకేఎం) రెండోసారి అధికారాన్ని చేపట్టనుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏప్రిల్ 19 ఎన్నికలు జరగ్గా.. లోక్‌సభతోపాటు ఫలితాలను ఈ నెల 4న ప్రకటించాల్సి ఉంది.
ముఖ్యమంత్రి పేమా ఖండూ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లో అధికారం నిలబెట్టుకుంది. ఆదివారంనాడు వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 60 నియోజకవర్గాల్లో 46 స్థానాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 2019లో సాధించిన 41 స్థానాల రికార్డను కూడా బద్ధలుకొట్టింది.
సిక్కింలో అధికారంలో ఉన్న క్రాంతికారీ మోర్చా(SKM) సిక్కింలో క్లీన్ స్వీప్ అంచున ఉండగా, అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది.
సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 6గంటలకే ప్రారంభమైంది. సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(SKM) పార్టీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో 32స్థానాల్లో 30స్థానాలకు ట్రెండ్ వెల్లడైంది. 29స్థానాల్లో ఎస్కేఎం, 1స్థానంలో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.
సినిమా విడుదలయ్యే ముందు ట్రైలర్ విడుదలైనట్లు.. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ క్రమంలో మరికాసేపట్లో పలు సర్వే సంస్థలు, వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల ద్వారా ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించనున్నాయి.
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈనెల 4వ తేదీన వెలువడనుండగా, దీనికి రెండ్రోజుల ముందుగానే జూన్ 2వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ , సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలు, సిక్కింలోని 32 నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది.