Share News

Raman Singh: దూసుకుపోతున్న ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్

ABN , First Publish Date - 2023-12-03T09:44:09+05:30 IST

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ చురుకుగా జరుగుతోంది. 90 అసెంబ్లీ స్థానాలకు గాను ఉదయం 9 గంటల ప్రాంతానికి కాంగ్రెస్ 52 స్థానాల్లో, బీజేపీ 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. రాజ్‌నంద్‌గావ్ నియోజకవర్గంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి దేవాంగన్‌పై ఆధిక్యంలో ఉన్నారు. 2018లో ఇదే నియోజకవర్గం నుంచి రమణ్ సింగ్ 16,933 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ నేత కరుణ శుక్లాపై గెలుపొందారు.

Raman Singh: దూసుకుపోతున్న ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్

రాయపూర్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ చురుకుగా జరుగుతోంది. 90 అసెంబ్లీ స్థానాలకు గాను ఉదయం 9 గంటల ప్రాంతానికి కాంగ్రెస్ 52 స్థానాల్లో, బీజేపీ 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. రాజ్‌నంద్‌గావ్ నియోజకవర్గంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ (Raman Singh) తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి దేవాంగన్‌పై ఆధిక్యంలో ఉన్నారు. 2018లో ఇదే నియోజకవర్గం నుంచి రమణ్ సింగ్ 16,933 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ నేత కరుణ శుక్లాపై గెలుపొందారు.


మాదే అధికారం: రమణ్ సింగ్

ఓవైపు కౌంటింగ్ జరుగుతుండగా మరోవైపు బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుందని రమణ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. 42 నుంచి 55 సీట్లు గెలుచుకుంటామని ఆయన తెలిపారు. 2018లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, ఈసారి బీజేపీ తిరిగి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. నవంబర్ 7, 17 తేదీల్లో రెండు విడతలుగా ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ జరిగింది.

Updated Date - 2023-12-03T09:44:10+05:30 IST