Ration cards: రేషన్‌కార్డులను విభజించొద్దు
ABN , First Publish Date - 2023-07-16T09:45:15+05:30 IST
గృహిణులకు రూ.1000 ఆర్థికసాయం అందజేసే పథకం కోసం రేషన్‌కార్డులను విభజించరాదని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం(State Govt) ఆదేశిం
- జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు
ప్యారీస్(చెన్నై): గృహిణులకు రూ.1000 ఆర్థికసాయం అందజేసే పథకం కోసం రేషన్‌కార్డులను విభజించరాదని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం(State Govt) ఆదేశించింది. కుటుంబ పెద్దగా ఉన్న గృహిణికి ప్రతి నెలా రూ.1000 పంపిణీ చేసే పథకాన్ని మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి రోజైన సెప్టెంబరు 15న సీఎం స్టాలిన్(CM Stalin) ప్రారంభించనున్నారు. ఈ పథకం నిమిత్తం దరఖాస్తులను అందించనున్నారు. ఈ పథకంలో లబ్ధి పొందే నిమిత్తం ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న మహిళలు తమ రేషన్‌కార్డుల్లో తమ పేర్లు తొలగించి, కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న మహిళల పేర్లను తొలగించి, కొత్త రేషన్‌కార్డులను ఇవ్వరాదని, అలాంటి దరఖాస్తులను తిరస్కరించాలని ప్రభు త్వం స్పష్టం చేసింది. అదేవిధంగా ఒక కుటుంబంలో ఎంతమంది మహిళ లున్నారన్న వివరాలను తప్పనిసరిగా సేకరించాలని కలెక్టర్లకు, పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించింది.