Jammu And Kashmir: రెచ్చిపోయిన ఉగ్రవాదులు, రిటైర్డ్ పోలీసు అధికారి కాల్చివేత
ABN , Publish Date - Dec 24 , 2023 | 10:36 AM
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లా రిటైర్డ్ పోలీసు అధికారి మొహమ్మద్ షఫీని ఉగ్రవాదులు కాల్చిచంపారు. గంట్‌ముల్లా గ్రామంలోని షీరి ప్రాంతంలో ఉన్న మసీదులో ఆదివారంనాడు ప్రార్ధనలు చేస్తుండగా షఫీపై గుర్తుతెలియని సాయుధులు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
బారాముల్లా: జమ్మూకశ్మీర్‌లో (Jammu And Kashmir) ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లా రిటైర్డ్ పోలీసు అధికారి మొహమ్మద్ షఫీని ఉగ్రవాదులు కాల్చిచంపారు. గంట్‌ముల్లా గ్రామంలోని షీరి ప్రాంతంలో ఉన్న మసీదులో ఆదివారంనాడు ప్రార్ధనలు చేస్తుండగా షఫీపై గుర్తుతెలియని సాయుధులు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. భద్రతా బలగాలు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. జమ్మూకశ్మీర్ పోలీస్ శాఖలో మాజీ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా షఫీ పనిచేసినట్టు గుర్తించారు. పోలీసు అధికారిని తామే కాల్చిచంపినట్టు ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించ లేదు. రాజోరి సెక్టార్‌లో ఎల్‌ఓసి వెంబడి ఉగ్రవాదులు గత గురువారంనాడు జరిపిన దాడిలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన క్రమంలో తాజా ఘటన చోటుచేసుకోవడం కలకలం సృష్టిస్తోంది.