Mathura: మసీదుపై కాషాయజెండా...నలుగురు నిందితుల అరెస్ట్
ABN , First Publish Date - 2023-04-01T12:36:48+05:30 IST
రామ నవమి ఊరేగింపు సందర్భంగా మసీదు వద్ద కాషాయ జెండాలను ఎగురవేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు....
మథుర(ఉత్తరప్రదేశ్) : రామ నవమి ఊరేగింపు సందర్భంగా మసీదు వద్ద కాషాయ జెండాలను ఎగురవేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. (Saffron Flags By Mosque)రామనవమి ఊరేగింపు సందర్భంగా(Ram Navami Procession) ఇక్కడి జమాల్ మసీదు వెలుపల శాంతికి విఘాతం కలిగించినందుకు నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.గురువారం రామనవమి ఊరేగింపు సందర్భంగా ఇక్కడి మసీదు వద్ద దుకాణాలపై కాషాయ జెండాలను ఎగురవేసినట్లు నలుగురిపై ఆరోపణలు వచ్చాయి.
ఇది కూడా చదవండి : Sanjay Raut: ఏకే-47తో లేపేస్తా...ఎంపీ సంజయ్ రౌత్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బెదిరింపు
ఘియామండీ ప్రాంతంలోని రామాలయం నుంచి రామజన్మ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఊరేగింపు చౌక్ బజార్ కూడలికి చేరుకోగానే ఈ ఘటన జరిగింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ సంఘటన హిందూ, ముస్లిం వర్గాల ప్రజల మధ్య మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తించిందని పోలీసులు తెలిపారు.ఘటన జరిగిన వెంటనే భారీగా పోలీసులను మోహరించినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) శైలేష్ కుమార్ పాండే తెలిపారు.వీడియో ఆధారంగా నలుగురిని కావ్య, హనీ, రాజేష్, దీపక్‌లుగా గుర్తించి అరెస్టు చేసినట్లు పాండే తెలిపారు.