Sandeep Roy Rathore: గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనర్‌గా సందీప్‌రాయ్ రాథోర్
ABN , First Publish Date - 2023-06-30T09:15:41+05:30 IST
గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనర్‌గా సందీప్‌రాయ్ రాథోర్(Sandeep Roy Rathore) నియమితులయ్యారు. ఊనమంజేరిలోని తమిళనాడు పోలీసు
ప్యారీస్(చెన్నై): గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనర్‌గా సందీప్‌రాయ్ రాథోర్(Sandeep Roy Rathore) నియమితులయ్యారు. ఊనమంజేరిలోని తమిళనాడు పోలీసు అకాడమీలో డీజీపీగా ఉన్న సందీప్ రాథోర్‌ను పోలీసు కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ కమిషనర్ అముద గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
సందీప్‌రాయ్ రాథోర్ విశేషాలు...
ఢిల్లీకి చెందిన సందీప్‌రాయ్ పాఠశాల, కళాశాల విద్యాభ్యాసాన్ని అక్కడే పూర్తి చేశారు. 1992వ సంవత్సరం ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన రాష్ట్ర పోలీసు శాఖలో ఏఎస్పీగా బాధ్యతలు ప్రారంభించి పోలీసు శాఖలో పలు కీలక పదవుల్లో సమర్థవంతంగా పనిచేసి అవార్డులు కూడా దక్కించుకున్నారు. ముఖ్యంగా తూత్తుకుడి జిల్లాఎస్పీ, చెన్నై ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, కేంద్ర పారిశ్రామిక భద్రతా విభాగం డీఐజీ, రాష్ట్ర సముద్రతీర భద్రతాదళం ఐటీ తదితర పదవులలో రాణించారు. చెన్నై పోలీసు కమిషనరేట్(Chennai Police Commissionerate)ను విభజించి కొత్తగా ఏర్పాటు చేసిన ఆవడి కమిషనరేట్ మొట్టమొదటి కమిషనర్‌గా 2022 సంవత్సరం సందీప్‌రాయ్ నియమితులయ్యారు. ఆయన ఇటీవల ఊనమంజేరీ ప్రాంతంలోని పోలీసు అకాడమీకి డీజీపీగా పదోన్నతిపై బదలీ అయ్యారు. ప్రస్తుతం గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనర్‌గా నియమితులైన ఆయన 2008, 2015 సంవత్సరాల్లో రాష్ట్రపతి అవార్డులు కూడా పొందారు. ఆయనకు పలువురు పోలీసు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.