NSA Imposing: యోగికి సుప్రీంకోర్టు అక్షింతలు..!

ABN , First Publish Date - 2023-04-12T17:34:37+05:30 IST

రెవెన్యూ బకాయిలు అంశంలో సమాజ్‌వాదీ పార్టీ నేతపై జాతీయ భద్రతా చట్టం ప్రయోగించడంపై సుప్రీంకోర్టు..

NSA Imposing: యోగికి సుప్రీంకోర్టు అక్షింతలు..!

న్యూఢిల్లీ: రెవెన్యూ బకాయిలు అంశంలో సమాజ్‌వాదీ పార్టీ నేతపై జాతీయ భద్రతా చట్టం (NSA) ప్రయోగించడంపై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారంనాడు ఆక్షేపణ తెలిపింది. తెలివి లేకుండా చేసిన పనిగా (Non-Applicationa of mind) ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) సర్కార్‌‌పై అక్షింతలు వేసింది. అధికార పరిధిపై సరైన కసరత్తు చేయలేదని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. పిటిషనర్‌కు స్వేచ్ఛ ప్రసాదిస్తూ వెంటనే అతన్ని విడిచిపెట్టాలని ఆదేశించింది.

మొరాదాబాద్‌లో ఒక ఆస్తికి సంబంధించిన రెవెన్యూ బకాయిలపై వివాదం నెలకొనడంపై సమాజ్‌వాదీ పార్టీ నేత యూసుఫ్ మాలిక్‌‌పై గత ఏడాది ఏప్రిల్‌లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎన్ఎస్ఏ ప్రయోగించింది. ఈ కేసు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్.కె.కౌల్, ఎ.అమానుల్లా సారథ్యంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. యూసుఫ్ మాలిక్‌పై ఎన్ఎస్ఏ కేసు ప్రయోగించడంపై ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఎన్ఏస్ఐకి సంబంధించిన కేసా? అని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ''అధికార పరిధి గురించి సరిగా అవగాహన లేకుండా, బుర్ర ఉపయోగించకుండా పెట్టిన కేసు. ఎన్ఎస్ఏ కింద ఈ కేసు ప్రొసీడింగ్స్‌ను మేము కొట్టివేస్తున్నాం. పిటిషనర్‌కు తక్షణం విముక్తి కల్గించాలని ఆదేశిస్తున్నాం'' అని ధర్మాసనం తీర్పుచెప్పింది.

Updated Date - 2023-04-12T17:34:37+05:30 IST