Share News

Schools: వర్షాలతో పాఠశాలలకు సెలవు

ABN , First Publish Date - 2023-11-23T10:44:14+05:30 IST

తేలికపాటి, మోస్తరు వర్షాలకు పాఠశాలలకు సెలవు ప్రకటించరాదని, భారీ, అతిభారీ వర్షాలు కురిసిన సమయంలో

Schools: వర్షాలతో పాఠశాలలకు సెలవు

పెరంబూర్‌(చెన్నై): తేలికపాటి, మోస్తరు వర్షాలకు పాఠశాలలకు సెలవు ప్రకటించరాదని, భారీ, అతిభారీ వర్షాలు కురిసిన సమయంలో సెలవుపై ప్రధానోపాధ్యాయులు నిర్ణయం తీసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెల్లవారు జామున, ఉదయం వేళల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో, పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తారని విద్యార్థులు, తల్లిదండ్రులు భావిస్తున్నారు. కానీ, యథావిథిగా పాఠశాలలు పనిచేస్తాయని ఆలస్యంగా వచ్చిన ప్రకటనతో తల్లిదండ్రులు ఉరుకులు పరుగుల మీద పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో, వర్షాల సమయంలో పాఠశాలలకు సెలవు ప్రకటించే విషయమై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది.

వివరాలు ఇలా...

- తేలికపాటి, మోస్తరు వర్షాలకు సెలవు ప్రకటించాల్సిన అవసరం లేదు.

- వర్షం ఏ ప్రాంతంలో అధికంగా కురుస్తుందో ఆ ప్రాంతంలోని పాఠశాలలకు మాత్రం సెలవు ప్రకటించవచ్చు.

- పాఠశాల ప్రారంభ సమయానికి మూడు గంటల ముందుగా సెలవు ప్రకటించాలి. అనంతరం ఈ విషయాన్ని జిల్లా ప్రధాన విద్యాధికారి, జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించాలి.

- పాఠశాల ప్రాంగణంలో చేరిన నీటిని సత్వరం తొలగించేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టాలి.

- సెలవు భర్తీ చేసేలా శనివారాలు పనిదినంగా ప్రకటించాలి. సిలబస్‌ ఎప్పుడికప్పుడు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలి.

Updated Date - 2023-11-23T10:44:16+05:30 IST