Home » Heavy Rains
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఏంటని జనాలు భయపడుతున్నారు. అయితే ఓ పక్క ఎండలు మండుతుంటే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి నేడు హైదరాబాద్లో వాతావరణం ఎలా ఉంటుంది అంటే..
ఇసుకు తుఫాను ముట్టడించడంతో సిటీలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ దట్టమైన మేఘాలు కమ్ముకుని చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే కొద్దిగంటలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేసింది.
రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. కోవై, నీలగిరి, తేని, తెన్కాశి జిల్లాల్లో రాబోయే 48 గంటల్లో భారీవర్షం కురిసే అవకాశముందని తెలిపింది.
తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ జిల్లాలో రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా అరటి తోటలు దెబ్బతిన్నాయి. అలాగే.. తిరుప్పూరులో కురిసిన భారీ వర్షాలకు ఇద్దరు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.
Rains: వేసవి కాలం.. అసలే ఎండలు మండిపోతున్నాయి. అలాంటి వేళ.. ఒక్క సారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులు వీచడంతోపాటు వర్షం పడడంతో.. రైతులు తీవ్ర ఆందోళన చెందారు.
రాష్ట్రంలో అకాల వర్షంతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. కొన్ని చోట్ల భారీ వర్షం కురియగా.. చాలా చోట్ల మోస్తరు వానలు పడ్డాయి.
Weather Updates: హైదరాబాద్లో భారీగా వర్షం కురుస్తోంది. వర్షం రాకతో భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
అకాల వర్షం ఎప్పట్లానే రైతులకు కడగండ్లు మిగిల్చింది. రైతన్నల చెమటతో నెలల తరబడి తడిచిన పొలంలో కురిసిన వడగళ్లు కన్నీటిధారలను మిగిల్చాయి.
Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికోడుతున్నాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మత్రం భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. అయితే ఈ వానలు ఎక్కడ ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.