Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో కమలం హవా.. ప్రియాంక ``హైట్`` వ్యాఖ్యపై సింధియా కౌంటర్!
ABN , First Publish Date - 2023-12-03T14:10:22+05:30 IST
ఊహించిన విధంగానే మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ కంటే 90 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన జ్యోతిరాధిత్య సింధియా ప్రాంతమైన గ్వాలియర్-మాల్వా ప్రాంతంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది.
ఊహించిన విధంగానే మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ కంటే 90 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన జ్యోతిరాధిత్య సింధియా (Jyotiraditya Scindia) ప్రాంతమైన గ్వాలియర్-మాల్వా ప్రాంతంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో సింధియా సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) తన హైట్ గురించి చేసిన వ్యాఖ్యలను సింధియా తిప్పికొట్టారు (Madhya Pradesh Elections).
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక మాట్లాడుతూ.. ``సింధియా ఓ వెన్నుపోటుదారుడు. అతడితో కలిసి నేను యూపీ ఎన్నికల కోసం పని చేశాను. నాకు తెలిసినంతవరకు అతడి హైట్ చాలా తక్కువ. కానీ, అహంకారం మాత్రం బాగా ఎక్కువ`` అని కామెంట్ చేశారు. ప్రియాంక తన హైట్ గురించి చేసిన వ్యాఖ్యలపై తాజాగా సింధియా మాట్లాడారు. ``ఎవరో నా హైట్ గురించి మాట్లాడారు. అయితే గ్వాలియర్ ప్రజలు తమ ఎత్తు ఎంతో బలంగా చూపించారు`` అని సింధియా అన్నారు.
2020లో సింధియా మధ్యప్రదేశ్‌లో కమలనాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు అయిన సింధియా ప్రస్తుతం నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. సింధియా కారణంగానే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో గ్వాలియర్ ప్రాంతంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది.